'షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టర్రా. ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఒరిజినల్' అంటూ టాలీవుడ్‌లో కొత్త ఒరవడి సృష్టించాడు నవీన్ పొలిశెట్టి. స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకత్వం వహించిన 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' గతేడాది విడుదలై ఘనవిజయం అందుకుంది. పోలీసులకు కూడా అంతుచిక్కని కేసుల్ని ఛేదించే ఏజెంట్‌గా నవీన్ నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.
కామెడీ, సస్పెన్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం 2019లో విశేష ప్రేక్షకాదరణ పొందిన సినిమాల జాబితాలో ఒకటిగా నిలిచింది. మరి ఇలాంటి చిత్రానికి కొనసాగింపు రూపొందితే? అంచనాలు భారీగా ఉంటాయి. దాంతో అంతకు మించిన కథను సిద్ధం చేయాలి. స్వరూప్, నవీన్ 'ఏఎస్‌ఎస్‌ఏ' చిత్రానికి సీక్వెల్ రూపొందించే ఆలోచనలో ఉన్నారట. కథ కొత్తగా ఉంటేనే ప్రేక్షకులకు మరోసారి ఆదరిస్తారనే ఉద్దేశంతో స్క్రిప్ట్ పక్కాగా రూపొందించే పనిలో ఉన్నారని టాక్. 'ఏఎస్‌ఎస్‌ఏ' చిత్రానికి నవీన్ పొలిశెట్టినే స్క్రీన్‌ప్లే అందించాడు. మరోసారి ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటాడో చూడాలి.
ఇదీ చూడండి : ప్రముఖ గాయని వైవాహిక జీవితంలో మనస్పర్థలు!