ETV Bharat / sitara

దేవరకొండ సెంటిమెంట్ బ్రేక్ అయిందిగా​..! - విజయ్ దేవరకొండ సెంటిమెంట్​

అదృష్టమో లేక యాదృచ్ఛికమో తెలియదు కానీ సినీ కెరీర్‌ మొదలు పెట్టినప్పటి నుంచి విజయ్‌ దేవరకొండకు ఓ సెంటిమెంట్‌ బాగా పనిచేస్తోంది. వేరే కథానాయకులు నో చెప్పిన కథలను తాను దక్కించుకుని మంచి విజయాలను ఖాతాలో వేసుకుంటున్నాడీ రౌడీ హీరో. ఇటీవల విడుదలైన సినిమాతో ఈ సెంటిమెంట్​ బ్రేక్​ అయిందనే అంటున్నారు సినీప్రియులు.

After those heroes rejected those stories, vijay devarakonda worked on it
అదృష్టమో.. యాదృశ్చికమో.. సెంటిమెంట్ బ్రేక్​
author img

By

Published : Feb 16, 2020, 6:13 PM IST

Updated : Mar 1, 2020, 1:15 PM IST

విజయ్​ దేవరకొండ.. అచ్చమైన తెలంగాణ యాసలో మాట్లాడుతూ మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. వేరే హీరోల చేతుల నుంచి మారొచ్చిన కథలతో బ్లాక్​బస్టర్​ విజయాలు అందుకున్నాడు. విజయ్​ కెరీర్​కు ఊపునిచ్చిన 'పెళ్లిచూపులు', 'అర్జున్​రెడ్డి', గీతగీవిందం', 'టాక్సీవాలా' వంటి చిత్రాలన్నీ తొలుత వేరే కథానాయకుడి దగ్గరకు వెళ్లొచ్చినవే. అందుకే ఈ హీరో నుంచి ఓ సినిమా వస్తుందంటే ఆ కథకు అంతకుముందు ఏ హీరో నో చెప్పాడా? అని అభిమానులు ఆరా తీస్తున్నారు.

తాజాగా విజయ్​ నుంచి వచ్చిన 'వరల్డ్​ ఫేమస్​ లవర్' చిత్రం కూడా ఈ హీరోకు అలా వచ్చిందే. దర్శకుడు క్రాంతి మాధవ్‌ ముందుగా ఈ కథను నాని, శర్వానంద్​, సాయితేజ్​ వంటి యువ హీరోలకు వినిపించాడు. వాళ్లకెందుకో ఈ స్ర్కిప్ట్ నచ్చకపోవడం వల్ల ఆ కథ దేవరకొండ దగ్గరకు వచ్చింది. ఇటీవల ఈ విషయం బయటకు రాగానే విజయ్‌ మరోసారి సెంటిమెంట్‌తో మ్యాజిక్‌ చేస్తాడేమోనని అంతా భావించారు. కానీ, తాజాగా చిత్ర ఫలితం చూశాక ఆ సెంటిమెంట్‌ బ్రేక్‌ అయినట్లనిపిస్తోంది.

After those heroes rejected those stories, vijay devarakonda worked on it
అదృష్టమో.. యాదృశ్చికమో.. సెంటిమెంట్ బ్రేక్​

ప్రేమికుల రోజు కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి తొలిరోజు నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద దీనికి మరో చిత్రంతో పోటీ లేకపోవడం వల్ల వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫలితం చూసి నాని.. శర్వా.. తేజులు 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'ను వదులుకుని మంచి నిర్ణయమే తీసుకున్నారని సినీప్రియులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ప్రస్తుతం రౌడీ హీరో చూపంతా 'ఫైటర్‌'పైనే ఉంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ పాన్‌ ఇండియా చిత్రం ప్రస్తుతం సెట్స్‌పై ముస్తాబవుతోంది.

ఇదీ చదవండి: యువకుడి ప్రతిభకు 'విజయ' సాయం

Last Updated : Mar 1, 2020, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.