ETV Bharat / sitara

చెర్రీకి జోడీగా మరోసారి బాలీవుడ్​ బ్యూటీ! - అన్నియన్​ రీమేక్​లో అలియా భట్​

మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ - దర్శకుడు శంకర్​ కాంబోలో రూపొందుతోన్న చిత్రంలో బాలీవుడ్​ నటి అలియా భట్​ నటించనుందని సమాచారం. ఈ చిత్రంతో పాటు రణ్​వీర్​ సింగ్​తో శంకర్​ తెరకెక్కిస్తోన్న 'అన్నియన్​' రీమేక్​లోనూ ఈ బ్యూటీని సంప్రదించినట్లు తెలుస్తోంది.

After RRR, Alia Bhatt to reunite with Ram Charan again?
రామ్​చరణ్​, అలియా భట్​
author img

By

Published : May 23, 2021, 3:18 PM IST

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్​'(రణం రౌద్రం రుధిరం). ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్​చరణ్​, కొమురం భీమ్​గా ఎన్టీఆర్​ కనువిందు చేయనున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్​ నటి అలియా భట్​ టాలీవుడ్​కు పరిచయమవుతోంది. చెర్రీ సరసన హీరోయిన్​గా ఆమె నటిస్తోంది. ఈ సినిమా తర్వాత రామ్​చరణ్​ హీరోగా తెరకెక్కనున్న మరో చిత్రంలోనూ అలియా భట్​ ఎంపికైందని ప్రచారం జరుగుతోంది.

మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ - తమిళ దర్శకుడు శంకర్ కాంబోలో ఓ సినిమా రూపొందనుంది. అయితే ఇందులోనూ హీరోయిన్​గా అలియాను ఎంపికచేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా శంకర్​-రణ్​వీర్​ కాంబోలో తెరకెక్కుతోన్న 'అన్నియన్​' రీమేక్​ కోసం అలియాను సంప్రదించినట్లు సమాచారం.

అలియా భట్​ నటించిన 'గంగూబాయి కతియావాడి' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు 'బ్రహ్మాస్త్ర', 'తఖ్త్​' చిత్రాలతో బిజీగా ఉంది.

ఇదీ చూడండి.. 100 ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేసిన స్టార్ సింగర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.