ETV Bharat / sitara

బాలీవుడ్​లో మరొకరికి కరోనా.. ఈసారి ప్రముఖ దర్శకుడు!

బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్​లీలా భన్సాలీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే ధ్రువీకరించారు. ప్రస్తుతం తన ఆఫీస్​లో క్వారంటైన్​లో ఉన్నట్లు తెలిపారు. కాగా, భన్సాలీ దర్శకత్వంలో' గంగూబాయ్ కతియావాడి' చిత్రం చేస్తోన్న ఆలియా భట్ కరోనా ఫలితం ఇంకా రాలేదు.

After Ranbir, now SLB tests COVID-19 positive; Alia's test results awaited
భన్సాలీ, ఆలియా
author img

By

Published : Mar 9, 2021, 1:58 PM IST

హీరో రణ్​బీర్ కపూర్​కు కరోనా సోకిన కొద్దిసేపట్లోనే మరో వార్త బాలీవుడ్​ను షాక్​కు గురిచేసింది. ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ కరోనా బారినపడ్డారనేది దీని సారాంశం. ప్రస్తుతం ఆయన తన ఆఫీస్​లోనే క్వారంటైన్​లో ఉన్నారు. కాగా, ప్రస్తుతం భన్సాలీ దర్శకత్వంలో 'గంగూబాయ్ కతియావాడి' చిత్రం చేస్తోన్న రణ్​బీర్ ప్రేయసి ఆలియా భట్ టెస్టు ఫలితం ఇంకా వెల్లడికాలేదు.

హుస్సేన్‌ జైదీ రచించిన 'మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబయి'లోని 'మేడమ్‌ ఆఫ్‌ కామతిపుర' ఆధారంగా 'గంగూబాయ్' తెరకెక్కుతోంది. కామతిపుర దేశంలోనే రెండో రెడ్​ లైట్​ ఏరియాగా పేరు గాంచింది!. ఈ చిత్రం జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి: బాలీవుడ్ హీరో రణ్​బీర్​కు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.