ETV Bharat / sitara

బాలీవుడ్​లోకి జూ.ఎన్టీఆర్ 'ఊసరవెల్లి'? - Jr NTR's Oosaravelli

తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన 'ఊసరవెల్లి' సినిమాను బాలీవుడ్​లోకి రీమేక్​ చేయనున్నారట. ఈ మేరకు ఓ నిర్మాణ సంస్థ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై ప్రకటన రానుంది.

Jr NTR's Oosaravelli to be remade in Hindi?
బాలీవుడ్​లోకి జూ.ఎన్టీఆర్ 'ఊసరవెల్లి'?
author img

By

Published : Nov 29, 2020, 11:08 AM IST

దక్షిణాది సినిమాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా బాలీవుడ్​లో రీమేక్​ అవుతున్నాయి. ప్రభాస్ 'ఛత్రపతి' రీమేక్​.. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ఇప్పుడు ఈ జాబితాలోకి జూ.ఎన్టీఆర్​ 'ఊసరవెల్లి' కూడా చేరనుందని తెలుస్తోంది. ప్రముఖ హిందీ నిర్మాత ఎస్.తౌరనీ.. దీనిని రూపొందించేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.

'ఊసరవెల్లి' స్క్రిప్ట్​ను బాలీవుడ్​కు తగ్గట్లుగా పలు మార్పులు చేస్తున్నారని సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి షూటింగ్​ కూడా మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుందట.

2011 దసరాకు వచ్చిన 'ఊసరవెల్లి'లో తారక్-తమన్నా జంటగా నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. రూ.57 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించింది. కొన్నేళ్ల క్రితం బెంగాలీలో 'రాకీ' పేరుతో ఈ సినిమాను రీమేక్​ చేశారు. మహాక్షయ్, పూజా బోస్ హీరోహీరోయిన్లుగా చేశారు.

'ఛత్రపతి' రీమేక్​తో బాలీవుడ్​లోకి బెల్లంకొండ

అల్లుడు శీను ఫేమ్ బెల్లంకొండ శ్రీనివాస్... ఛత్రపతి రీమేక్​తో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వివి వినాయక్ దర్శకుడు. పెన్ స్టూడియోస్​ నిర్మిస్తోంది.

'ఆర్​ఆర్ఆర్​'తో తారక్ బిజీ

రాజమౌళి తీస్తున్న 'ఆర్ఆర్ఆర్' షూటింగ్​తో జూ.ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇందులో తారక్, కొమరం భీమ్​గా కనిపించనున్నారు. రామ్​చరణ్, అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.