ETV Bharat / sitara

ఓటీటీలో విడుదలకు సిద్ధమైన 'బెల్​ బాటమ్​'! - ఓటీటీలో బెల్​ బాటమ్

అక్షయ్​ కుమార్​ కొత్త చిత్రం 'బెల్​ బాటమ్​'ను ఓటీటీలో విడుదల చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. థియేటర్లు తెరచినా.. డిజిటల్​ వేదిక ద్వారా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం యోచిస్తున్నట్లు సమాచారం.

After Laxmii, Akshay Kumar's Bell Bottom to release directly on an OTT platform?
ఓటీటీలో విడుదలకు సిద్ధమైన 'బెల్​ బాటమ్​'!
author img

By

Published : Jan 21, 2021, 7:25 AM IST

కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా దాదాపుగా తొమ్మిది నెలలపాటు థియేటర్లు తెరుచుకోలేదు. ఈ కారణంగా కొన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. అందులో బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​ నటించిన 'లక్ష్మి' చిత్రం కూడా ఉంది. ఇప్పుడు అదే బాటలో 'బెల్​ బాటమ్​' సినిమానూ నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది.

After Laxmii, Akshay Kumar's Bell Bottom to release directly on an OTT platform?
'బెల్​ బాటమ్​' చిత్రంలో అక్షయ్​ కుమార్

థియేటర్లు తెరిచినప్పటికీ డిజిటల్​ వేదికలోనే చిత్రాన్ని రిలీజ్​ చేయడానికి మొగ్గు చూపుతున్నారని సమాచారం. లాక్​డౌన్​ తర్వాత బాలీవుడ్​లో చిత్రీకరించిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. యాక్షన్​ థ్రిల్లర్​ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అక్షయ్​ కుమార్​ డిటెక్టివ్​ పాత్ర పోషించారు. ఇందులో అక్షయ్​ కుమార్​ సరసన వాణిీ కపూర్​ హీరోయిన్​గా నటించారు.

ఇదీ చూడండి: మాల్దీవుల విహారయాత్రలో రాకీభాయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.