బాలీవుడ్ భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో హీరోయిన్ అలియా భట్ మరోసారి పనిచేసేందుకు సిద్ధమవుతోంది. ప్రసుతం వీరిద్దరూ 'గంగూబాయి కతియావాడి' చిత్రం కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో అలియా నటనకు ఫిదా అయిన భన్సాలీ.. తన తర్వాత ప్రాజెక్టులోనూ ఆమెకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట.
ఈ నేపథ్యంలో మరోసారి వీరి కాంబో రిపీట్ కాబోతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ప్రస్తుతం చర్చల దశలో ఉందని.. త్వరలో అధికారిక ప్రకటన రానుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
భన్సాలీ దర్శకత్వం, నిర్మాణంలో ఒకే హీరోయిన్ రెండు లేదా మూడు సినిమాలు చేస్తోంది. ఇది నాటి ఐశ్వర్యరాయ్ నుంచి దీపికా పదుకొణె వరకు సాగింది. అదే నిజమైతే ఇప్పుడా జాబితాలోకి అలియా వచ్చి చేరుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇది చదవండి: 'గంగూబాయ్..' చిత్రాన్ని నిలిపి వేయాలంటూ పిటిషన్