ETV Bharat / sitara

28 ఏళ్ల తర్వాత.. జాతీయ ఉత్తమ నటి - mahanati

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో 28 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం దక్కింది. ఉత్తమ నటిగా 'మహానటి' చిత్రంలో సావిత్రి పాత్రకు ప్రాణం పోసిన కీర్తి సురేష్ ఆ పురస్కారానికి ఎంపికైంది.

కీర్తి సురేష్
author img

By

Published : Aug 10, 2019, 5:37 AM IST

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఉత్తమ ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రవేశపెట్టింది. ఈ అవార్డుల్లో 28 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ప్రకటించిన పురస్కారాల్లో జాతీయ ఉత్తమ నటి అవార్డును దక్కించుకుంది కీర్తి. ఉత్తరాది నటీమణులే ఎక్కువగా ఈ విభాగంలో పురస్కారాలు అందుకోగా.. 66వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో 'మహానటి' చిత్రానికిగాను కథానాయిక కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైంది. ఈ అవార్డులు ప్రకటించినప్పటి నుంచి జాతీయ ఉత్తమ నటి విభాగంలో ఇప్పటి వరకు ముగ్గురు మాత్రమే తెలుగువాళ్లు ఆ పురస్కారాలు అందుకోగా.. కీర్తి సురేష్ నాలుగో కథానాయిక కావడం విశేషం.

after-28-years-tollywood-get-best-female-actor-in-national-film-awards
మహానటి చిత్రంలో కీర్తి సురేష్

'మహానటి' సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అఖిలాంధ్ర ప్రేక్షకుల చేత నీరాజనాలందుకుంది కీర్తి. చేసింది తక్కువ చిత్రాలే అయినా దర్శకుడు నాగ్ అశ్విన్ తనలో సావిత్రి పోలికలను చూసి ఆ పాత్రకు ఎంపిక చేశాడు. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల పాటు శ్రమించిందీ నటి. స్వయంగా డబ్బింగ్ చెప్పి మహానటి సావిత్రినే మైమరిచిపోయేలా చేసింది. స్వల్ప వ్యవధిలోనే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది కీర్తి సురేష్​.

దాసి చిత్రంలో అర్చన

'మహానటి' చిత్రానికి మూడు విభాగాల్లో పురస్కారాలు దక్కగా జాతీయ ఉత్తమ నటి పురస్కారం రావడం యావత్ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చింది. 1967లో ఈ పురస్కారాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 41 మంది కథానాయికలు 52 సార్లు జాతీయ ఉత్తమ నటి విభాగంలో పురస్కారాలు అందుకున్నారు. వారిలో 1967లో బాలీవుడ్ చిత్రం 'రాత్ ఔర్ దిన్' చిత్రానికి తొలిసారిగా నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకోగా.. ఆ తర్వాత షబానా అజ్మీ ఐదు సార్లు ఈ గౌరవాన్ని పొందింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దక్షిణాదిన మాత్రం శారద, అర్చన, శోభనలు మూడుసార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్నారు. 1978లో 'నిమజ్జనం' తెలుగు చిత్రానికి శారద జాతీయ ఉత్తమ నటిగా తొలి పురస్కారాన్ని అందుకోగా.. ఆ తర్వాత 10 ఏళ్లకు 1988 లో వచ్చిన 'దాసి' సినిమాకు కథానాయిక అర్చన జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. అనంతరం మూడేళ్లకు 1990లో లేడీ సూపర్ స్టార్​గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి 'కర్తవ్యం' చిత్రానికి ఈ అవార్డును దక్కించుకుంది. అప్పటి నుంచి 2017 వరకు హిందీ, మలయాళం, తమిళ, కన్నడ, బెంగాలీ చిత్రాలకే జాతీయ ఉత్తమ నటి విభాగంలో పురస్కారం దక్కింది.

మళ్లీ 28 ఏళ్ల తర్వాత జాతీయ ఉత్తమ నటి విభాగంలో తెలుగు సినిమాకు పురస్కారం రావడం పట్ల యావత్ తెలుగు చలన చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ పురస్కారం కింద రజత కమలంతో పాటు 50 వేల రూపాయల నగదు పురస్కారాన్ని అందించనున్నారు.

ఇవీ చూడండి.. ఈ అవార్డు అమ్మకు అంకితమిస్తున్నా: కీర్తి సురేశ్

RESTRICTIONS: Part must retain CityTV bug. SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Various.
SOURCE - SNTV
Nanjing, China - 18th July 2019
1. 00:00 Ilkay Gundogan training with Manchester City during pre-season
SOURCE - CityTV (Must retain CityTV bug)
Manchester, England, UK - 9th August 2019
++Please note, start of soundbite overlaid with training footage++
2. 00:05 SOUNDBITE (English): Ilkay Gundogan, Manchester City:
"Yeah, it was always an achievement for me, you know, to play for him (Manchester City manager Pep Guardiola), to train under him, and being able to do it now for three years is amazing. And, yeah, being able to continue that now for another at least four years is just an amazing feeling, and that was the main thing also to be honest, we have great players and we achieved already a lot, but I think there is more to come. There is still a lot of potential and I'm happy that I can be a part, yeah, of getting all the rest out of us."         
SOURCE: SNTV / CityTV
DURATION: 00:45
STORYLINE:
Ilkay Gundogan has signed a new four-year contract with Manchester City, the Premier League champions have announced.
The German midfielder, who had just entered the final year of his previous deal, is now committed to the club until 2023.
The news ends speculation over the future of the 28-year-old, who joined City from Borussia Dortmund in 2016.
Gundogan's first season at City was cut short by a serious knee injury but he has been a key part of the club's back-to-back Premier League triumphs over the past two campaigns.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.