ETV Bharat / sitara

1100 అడుగుల ఎత్తు నుంచి దూకి 'త్రిష' సాహసం! - టాలీవుడ్ ముద్దుగుమ్మలు

ఒకప్పటిలా కాదిప్పుడు! హీరోలతో పోటీపడుతూ నాయికా ప్రాధాన్యమున్న సినిమాలొస్తున్నాయి. దాంతో అమ్మాయిలూ ఫైట్లూ, స్టంట్లూ, కొండలు ఎక్కడం వంటివి చేసేస్తున్నారు. అయితే కొందరు హీరోయిన్లు సినిమాల్లోలా ఉత్తుత్తి సాహసాలకే పరిమితం కావట్లేదు. నిజ జీవితంలోనూ చేసి ఔరా అనిపిస్తున్నారు. కొందరు సేవనూ జోడిస్తున్నారు.

heroines adventure
హీరోయిన్ల సాహసాలు
author img

By

Published : Jul 17, 2021, 8:41 AM IST

సినిమాల్లో అప్పుడప్పుడు ఫైట్లు, సాహసాలు చేసి అలరించే హీరోయిన్లు.. నిజ జీవితంలోనూ అడ్వెంచర్లు చేసి ఆకట్టుకుంటున్నారు. అందంతో పాటు తమ ధైర్యసాహసాలను ప్రదర్శిస్తూ ఔరా అనిపిస్తున్నారు. అయితే ఏయే నటీమణులకు ఎలాంటి అడ్వెంచర్లు ఇష్టమో.. మీకోసం.

వాటర్‌ స్పోర్ట్స్‌ ఇష్టం

heroines adventure
రెజీనా

మల్టీ టాలెంటెడ్‌ కథానాయిక రెజీనా. తెలుగు, తమిళం రెండిట్లోనూ ఉనికిని చాటుకుంటోంది. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిచ్చే రెజీనాకు సాహసాలన్నా ఇష్టమే. ముఖ్యంగా వాటర్‌ స్పోర్ట్స్‌. చెన్నైలో ఈ ఏడాది నిర్వహించిన 'స్టాండప్‌ పెడల్‌ రేస్‌'లో మొదటి బహుమతి గెలుచుకుంది. ఈ ఏప్రిల్‌లో పారా అథ్లెట్‌ల కోసం నిధులు సేకరించడానికి చెన్నై నుంచి పుదుచ్చేరికి 140కి.మీ. సైక్లింగ్‌ చేసింది. గత ఏడాది ఉత్తరాఖండ్‌లో 'వైల్డ్‌ వారియర్‌ హిమాలయన్‌ అడ్వెంచర్‌ రేస్‌' 30 ఫర్‌ 30 ఛాలెంజ్‌ను నిర్వహించారు. రెజీనా ఇందులో పాల్గొంది. హీమోఫీలియా, క్యాన్సర్‌లపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ఉద్దేశం. అంతేకాదు దీని ద్వారా వచ్చిన నిధులతో 30 మంది పిల్లలకు సాయమందిస్తారు. దీనిలో భాగంగా మౌంటెన్‌ బైకింగ్‌, హైకింగ్‌, ఇంకా నీటిలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. గతంలోనూ బెంగళూరులో వరల్డ్‌ వారియర్‌ డూవాత్లాన్‌లో పాల్గొంది. ఈమెకు సర్ఫింగ్‌ అన్నా చాలా ఇష్టమట. కేరళలోని సర్ఫింగ్‌ స్కూల్లో శిక్షణ కూడా తీసుకుంటోంది.

1168 అడుగుల ఎత్తు నుంచి..

heroines adventure
త్రిష

త్రిష.. తెలుగుతోపాటు తమిళంలోనూ అగ్ర కథానాయిక. టాప్‌ హీరోలందరితో నటించింది. ఈమెకు ప్రయాణాలంటే పిచ్చి. ఏమాత్రం ఖాళీ దొరికినా విదేశాలకు చెక్కేస్తుంది. బంగీ జంప్‌, స్కైడైవింగ్‌ వంటి సాహస క్రీడలను ప్రయత్నిస్తుంది. ఓసారి కెనడాలో 1168 అడుగుల ఎత్తు నుంచి బంగీ జంప్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పది నిమిషాలపాటు గాల్లోనే ఉండి, కింద స్టేడియంలో జరుగుతున్న బేస్‌బాల్‌ మ్యాచ్‌నూ వీక్షించింది. అది తన జీవితంలో ఓ మధురానుభూతి అంటోంది. అంతేకాదు.. ఓ తమిళ సినిమా కోసం స్కూబా డైవింగ్‌నూ నేర్చుకుంది. తను ఇప్పటిదాకా చేసిన వాటిలో స్కైడైవింగ్‌ త్రిషకు బాగా నచ్చిన అడ్వెంచరట. ఏడాదికోసారైనా తప్పక చేస్తానని చెబుతోంది.

ఫార్ములా వన్‌లో శిక్షణ..

heroines adventure
నివేదా పేతురాజ్‌

'మెంటల్‌ మదిలో' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నివేదా పేతురాజ్‌. తర్వాత 'చిత్రలహరి', 'బ్రోచేవారెవరురా' సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు ఫార్ములా వన్‌ రేసర్‌గా సర్టిఫికెట్‌ అందుకుని వార్తల్లో నిలిచింది. పాఠశాల రోజుల్లోనే స్పోర్ట్స్‌ కార్లపై మనసు పారేసుకున్న నివేదా.. ఎంతో ఇష్టంగా ఈ రంగంలో శిక్షణ తీసుకుంది. 2015లోనే ఓ స్పోర్ట్‌కారు కూడా కొంది. అంతేకాదు.. యూఏఈలో అప్పట్లో డాడ్జ్‌ ఛాలెంజర్‌ కారు కొన్న రెండో మహిళగానూ గుర్తింపు పొందింది. ప్రస్తుతం లెవల్‌ వన్‌ కంప్లీట్‌ చేసి తర్వాత లెవల్‌ పూర్తి చేయడంపై దృష్టి సారించానని చెబుతోంది.

ప్రకృతితో ప్రయాణం..

heroines adventure
తమన్నా

కరోనా వచ్చాక జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. తనూ దీనికి మినహాయింపేం కాదంటోంది తమన్నా. లాక్‌డౌన్‌లో కుకింగ్‌, వర్కవుట్ల వీడియోలు చేసిన తమన్నా ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రకృతిలో విహరించాలనుకుంది. అందుకు ట్రెక్కింగ్‌ను ఎంచుకుంది. దీని గురించి చెబుతూ నేచర్‌తో ప్రేమలో పడ్డానంటూ 'తమన్నా స్పీక్స్‌' ఇన్‌స్టా ఖాతాలో ఓ వీడియో షేర్‌ చేసింది. మహారాష్ట్రలోని థానేలో ఉన్న పాపులర్‌ ట్రెక్కింగ్‌ డెస్టినేషన్‌ అసంగావ్‌ మహులీ పోర్టుని సందర్శించింది. అక్కడి అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్‌ చేసింది ఈ మిల్కీ బ్యూటీ. అప్పటి నుంచి వీలైనప్పుడల్లా ట్రెక్కింగ్‌కు వెళ్తోంది.

21 కిలోమీటర్లు ర్యాఫ్టింగ్‌

heroines adventure
లావణ్య త్రిపాఠి

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.. ఫిట్‌నెస్‌ విషయంలో ఫర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. హైకింగ్‌ అంటే ఆసక్తి అని చెప్పిన ఈ భామ.. ఈ ఏడాది నిహారిక కొణిదెల దంపతులు, ఇతర స్నేహితులతో కలిసి రివర్‌ ర్యాఫ్టింగ్‌ చేసింది. 'ఇది నిహారిక ఆలోచన.. విషయం చెప్పగానే వెంటనే ఓకే చెప్పేశా. నా స్నేహితులతో కలిసి గడిపిన గొప్ప సమయం ఇది. నాకు వాటర్‌ స్పోర్ట్స్‌ అంటే ఇష్టం. మెరైన్‌ డ్రైవ్‌ నుంచి రిషికేశ్‌ వరకూ 21 కిలోమీటర్లు ప్రయాణించా. ప్రకృతిని ఆస్వాదిస్తూ హిమాలయ పర్వత శ్రేణుల్ని చూస్తూ చేసిన ఈ ప్రయాణం అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చింది' అని చెబుతోంది లావణ్య. తాజాగా ఆమె ముస్సోరీకి సమీపంలోని ఓ పర్వత గ్రామంలో వాళ్ల కుటుంబం కోసం కొంత వ్యవసాయ భూమిని కొని నేచర్‌ కేఫ్‌ పేరుతో పర్యావరణ హిత ఇంటిని నిర్మించనుంది.

సైకిల్‌ యాత్రతో సేవ..

heroines adventure
మంచు లక్ష్మి

నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా.. గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు సాహసాలంటే మక్కువ. ఆ ఇష్టంతోనే గతంలో ఓ రియాల్టీషోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారామె. యోగ, మెడిటేషన్‌ వంటివి చేస్తూ ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే ఆమె గతేడాది లాక్‌డౌన్‌ కాలంలో సైక్లింగ్‌పై మనసు పారేసుకున్నారు. కేవలం సరదాగా దాన్ని తొక్కడమే కాదు.. ఛారిటీ కోసం ఏకబిగిన ఐదుగంటల పాటు వంద కిలోమీటర్లు ప్రయాణించారు. దివ్యాంగుల కోసం పనిచేసే ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ కోసం నిధులు సేకరించారు.

ఎముకలు కొరికే చలైనా వెనుకాడదు

heroines adventure
రుహీ సింగ్

మోసగాళ్లు చిత్రంతో తెలుగు సినీపరిశ్రమకు పరిచయమైన యువ కథానాయిక రుహీ సింగ్‌. ఆమెకు నటనే కాదు.. సాహస క్రీడలంటే మహా ఇష్టం. కశ్మీర్‌లో ఇటీవల నిర్వహించిన స్కీయింగ్‌ పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకుంది. ట్రెక్కింగ్‌, స్కూబా డైవింగ్‌, పారాసెయిలింగ్‌, స్కీయింగ్‌ లాంటి క్రీడలంటే చెవి కోసుకుంటుంది. ఆ ఆసక్తితోనే సినిమా షూటింగుల్లో ఎంత బిజిగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా సమయం కేటాయించి మరీ శిక్షణ తీసుకుంది. గత ఐదేళ్లలో ఎన్నో సాహస క్రీడల్లో పాల్గొంది. కాలంతో సంబంధం లేదు.. అది మండు వేసవైనా..ఎముకలు కొరికే చలి అయినా.. వీలుచిక్కినప్పుడల్లా పర్వత ప్రాంతాలకు పయనమవుతుంది రుహీ. ఒంటరిగా లాంగ్‌ రైడ్‌లకు వెళ్లడమంటే ఆమెకు ఎంతో ఇష్టం. కొత్తవారిని కలుస్తూ.. వారి సంస్కృతి సంప్రదాయాలు, జీవన విధానాల గురించి తెలుసుకోవడమంటే సరదా. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని అంటోంది రుహీ సింగ్‌.

డైవింగ్‌ అంటే మక్కువ

heroines adventure
భూమిక

'యువకుడు' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన భూమికకు సాహస క్రీడలంటే మక్కువ. వీలు చిక్కినప్పుడల్లా ట్రెక్కింగ్‌ చేస్తుంటుంది. సముద్రంలో డైవింగ్‌ చేస్తూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్పుడప్పుడు పంచుకుంటుంది. ఎత్తైన ప్రాంతం నుంచి రోప్‌ సహాయంతో కిందకి దూకడమంటే మహా సరదా. ఇటీవల భూమిక పోస్టు చేసిన డైవింగ్‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. సాహస క్రీడల వల్ల ఆనందంతోపాటు మానసికస్థైర్యం పెంపొందుతుందని చెబుతుంది ఈ ముంబయి భామ. "సక్సెస్‌కు షార్ట్‌కట్స్‌ ఉండవు. శక్తినంత కూడగట్టుకొని పని చేస్తేనే విజయం నీ సొంతమవుతుంది" అంటూ రీల్‌ లైఫ్‌లోనే కాకుండా రియల్‌ లైఫ్‌లోనూ ఓ చక్కని సందేశమిస్తోందండోయ్‌.

ఇదీ చూడండి: టాలీవుడ్ భామలు.. ట్రెండ్ మారిస్తే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.