అడివి శేష్.. పరిచయం అవసరం లేని పేరు. 'క్షణం', 'గూఢచారి' చిత్రాలతో తెలుగు సినిమా పంథాను మార్చి ట్రెండ్ సెట్ చేసిన నటుడు. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అడివి శేష్ అని 'ఎవరు' చిత్రంతో మరోసారి నిరూపించుకున్నాడు. టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శేష్ ప్రస్తుతం 'ఎవరు' సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.
తాజాగా ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ పిల్లలతో అల్లరి చేస్తూ గడిపిన క్షణాలను తన ఫోన్‌లో బంధించి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు శేష్. పవన్ తనయుడు అకీరా, కూతురు ఆద్యాలతో చేసిన అల్లరిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్టేటస్ పెట్టి సర్‌ప్రైజ్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. అయితే వాళ్లని ఎప్పుడు, ఎలా, ఎక్కడ కలిశాడో మాత్రం చెప్పకుండా అందరిలో ఆసక్తి పెంచాడు. గతంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన 'పంజా' సినిమాలో ప్రతినాయకుడిగా అడివి శేష్ నటించాడు.
ఇవీ చూడండి.. అక్టోబరులో బంగర్రాజు సందడి షురూ..?