ETV Bharat / sitara

ఎవరిని ప్రేమిస్తున్నాడో చెప్పిన 'మేజర్'​ అడవి శేష్​! - అడవి శేషు

Adivi Sesh Marriage: విభిన్నమైన కథలతో ప్రేక్షకులకు నూతన అనుభూతిని పంచే నటుడు అడవి శేష్. నేడు (డిసెంబర్ 17) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'మేజర్'​ సినిమా విశేషాలు సహా ఆయన పెళ్లి గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు శేష్.

adivi sesh major
అడవి శేష్‌
author img

By

Published : Dec 17, 2021, 7:08 AM IST

Adivi Sesh Marriage: ప్రేక్షకులపై బలంగా ప్రభావం చూపిస్తున్న యువ కథానాయకుల్లో అడవి శేష్‌ ఒకరు. ఈయన సినిమా చేస్తున్నారంటే ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తుంటుంది. 26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా 'మేజర్‌' సినిమా చేస్తున్నారు. దాంతోపాటు పాన్‌ ఇండియా స్థాయిలో మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. శుక్రవారం అడవి శేష్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన 'ఈనాడు సినిమా'తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలివీ..

adivi sesh major
అడవి శేష్‌

'మేజర్‌' పనుల మధ్యే ఈసారి పుట్టినరోజు జరుపుకొంటున్నారా?

ఆ సినిమా చిత్రీకరణ పూర్తయింది. డబ్బింగ్‌తోపాటు, ఇతర నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను రచయితని కాబట్టి మధ్యలో ఏ మాట ఎలా చెప్పాలంటూ ఫోన్‌ కాల్స్‌ వస్తుంటాయి. ఎప్పటికప్పుడు మేజర్‌ సందీప్‌ తల్లిదండ్రులతో మాట్లాడుతూ, ఒక ప్యాషన్‌తో చేసిన ప్రాజెక్ట్‌ ఇది. మనం కెమెరా ముందు నటించేసి కార్‌వ్యాన్‌లోకి వెళ్లి కూర్చుందాం అనుకునే సినిమా కాదు. చాలా బాధ్యతతో కూడిన ప్రాజెక్ట్‌. దీంతోపాటు మధ్యలో 'హిట్‌ 2' కొంచెం చేశాం. ఇలా చాలా రోజులుగా పరిగెత్తుతున్నట్టు ఉంది. గతేడాది పుట్టినరోజుకి అమ్మానాన్న వచ్చారు. ఈసారి వాళ్లతోనే గడపుతా. పోయినసారి కరోనా భయాలతో ఇంట్లోనూ మాస్క్‌లు పెట్టుకుని దూరం దూరం ఉంటూ మాట్లాడుకున్నాం. ఈసారి వ్యాక్సిన్‌ అయ్యింది కాబట్టి అమ్మానాన్నలతో కలిసి లంచ్‌కి వెళతాం. మధ్యలో పదేళ్లు అమ్మా నాన్నలకి దూరంగా ఉంటూ పుట్టిన రోజుని జరుపుకొన్నా. స్కైప్‌ల్లో, వాట్సప్‌ వీడియోలో వాళ్లు నాకోసం అక్కడ కేక్‌ కట్‌ చేసేవాళ్లు. వాళ్లు నాతోపాటు ఉండటం అన్నిటికంటే ఎక్కువగా సంతోషాన్నిచ్చే విషయం.

'మేజర్‌' చిత్రంతో పాన్‌ ఇండియా మార్కెట్లోకి అడుగు పెడుతున్నారు. ఎలా అనిపిస్తోంది?

మార్కెట్‌ పెంచుకోవడం కోసం 'మేజర్‌'ని పాన్‌ ఇండియా చిత్రంలా చేయలేదు. మేజర్‌ సందీప్‌ కథని నిజాయతీగా చెప్పాలనే ఉద్దేశంతో చేశాం. దీన్ని మేం అనువదించడం లేదు. హిందీ, తెలుగు.. ఇలా ఏ భాషకి ఆ భాషలో ఆయా భావోద్వేగాలకి అనుగుణంగా ప్రత్యేకంగా స్క్రిప్ట్‌ రాసుకుని రెండు భాషల్లో చేశాం. ఉత్తరాది నుంచి దక్షిణాదికో, లేదంటే ఇక్కడి నుంచి అక్కడికో వెళుతున్న సినిమాలా చేయలేదు. ఇదొక ఇండియన్‌ సినిమా అని బాలీవుడ్‌ మార్కెట్‌, అక్కడి మీడియా కూడా నమ్మింది. మహేష్‌బాబు ఈ సినిమాకి నిర్మాత. తొలిసారి ఆయన బ్యానర్‌ పేరు మరో హీరో చేస్తున్న పోస్టర్‌పై కనిపిస్తోంది. ఆయన కోటీశ్వరుడు షోలో చెప్పినట్టుగా మేం ఈ సినిమా కోసమని ఎక్కువసార్లు కలిసింది లేదు కానీ, చాలా ప్రొడక్టివ్‌గా ఈ చిత్రాన్ని ప్రపంచం ముందుకు ఎలా తీసుకెళ్లాలనే విషయంపై చర్చించుకున్నాం. ఆయన 'మేజర్‌'పై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నా.

adivi sesh major
'మేజర్' పోస్టర్

మీ నుంచి సినిమా వస్తోందంటే ఒక ఆశతో ఎదురు చూసేలా ప్రేక్షకులపై ప్రభావం చూపించారు. దీని వెనక ప్రయాణం గురించి ఏం చెబుతారు?

దీన్నే విశ్వసనీయతని సంపాదించడం అంటారు. కష్టపడితే కచ్చితంగా ప్రేక్షకులు నమ్ముతారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంతే. ఇంతకాలం నేను ఆ పనిలోనే ఉన్నాను. ఒక నటుడికి పరిశ్రమ నేపథ్యం, అండ లేనప్పుడు ప్రేక్షకుల్లో ఓ బ్రాండ్‌, ఓ గౌరవాన్ని తెచ్చుకోవడం కొంచెం కష్టం. మనలో ప్రతిభ ఉంటూ.. దానికి అదృష్టం తోడైనప్పుడు అవన్నీ కలిసొస్తాయి. ఆ విషయంలో నేను క్లిక్‌ అయ్యాను. తొలినాళ్లల్లో జనాలకి ఏం నచ్చుతుందనే లెక్కల్లోకి ఎక్కువగా వెళ్లిపోయి, ఎవరు ఏం చెబితే దానికి తగ్గట్టే చేసేవాణ్ని. ఇప్పుడు మొదట నాకు నచ్చాలి, ఆ తర్వాత జనాలకి నచ్చుతుందో లేదో చూసుకోవాలనే లెక్కతో ప్రయాణం చేస్తున్నా.

మీరు, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రవీంద్రన్‌, దర్శకుడు సుజీత్‌ మంచి స్నేహితులు కదా, మీ కలయికలో సినిమాని ఆశించొచ్చా?

చెయ్యాలని మాకూ ఉంది. ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. కానీ ఒక పెద్ద ప్రశ్న ఏమిటంటే కిషోర్‌ జోక్‌లేస్తే మేం నవ్వుకోవాలా? లేక షూటింగ్‌ చేసుకోవాలా? అని! (నవ్వుతూ). ఆ ప్రశ్నకి సమాధానం దొరికినప్పుడు, మాకు తగ్గ స్క్రిప్ట్‌ కుదిరినప్పుడు కచ్చితంగా చేస్తాం. మేం పెద్దగా కలుసుకోం కానీ, కలిసినప్పుడంతా నిన్న, మొన్న కలుసుకున్నాం అన్నట్టే ఉంటుంది. మా వాట్సాప్‌ గ్రూప్‌ మాత్రం ఎప్పుడూ మోత మోగిపోతుంటుంది. రాహుల్‌ రవీంద్రన్‌ ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించే ఆశావాది. ఏదో సంతోషంగా ఓ ట్వీట్‌ పెడతాడు. నేనెక్కువగా ఆలోచించే వ్యక్తిని కాబట్టి సీరియస్‌గా ఏదో స్పందిస్తా. కిషోర్‌ మా ఇద్దరి మధ్య దూరి కౌంటర్లు వేస్తాడు, సుజీత్‌ మాత్రం నవ్వుకుంటాడు. ఇది మా స్నేహం. ఏ సినిమా ఎవరికి నచ్చిందనే విషయంపైనే మామధ్య చర్చలు నడుస్తుంటాయి.

పెళ్లి కబురు ఎప్పుడు వినిపిస్తారు?

నేను పనినే ప్రేమిస్తున్నా (నవ్వుతూ). మా ఇంట్లోనూ మొదట ఈ విషయం గురించి అడిగారు, కొన్నాళ్ల తర్వాత తిట్టారు, ఇక లాభం లేదనుకుని వదిలేశారు. పనిలో పడి బిజీ బిజీగా గడపడం వల్లేనేమో ఈమధ్యే మనకంటూ వ్యక్తిగత జీవితం ఉండాలి కదా అనిపించింది.

adivi sesh major
'మేజర్'

26/11 రోజున మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ తల్లిదండ్రులతో కలిసి ముంబయి తాజ్‌ హోటల్‌కి వెళ్లి గడిపారు. ఆ అనుభవం గురించి చెబుతారా?

అది మాటల్లో చెప్పలేని అనుభవం. 26న పోరాటం చేసి, 27న సందీప్‌ మరణించారు. ఆ రెండు రోజులూ నేను హోటల్‌లో గడిపా. సందీప్‌ ప్రాణాలు వదిలిన ప్రాంతంలో కూర్చుని ఆయన తల్లిదండ్రులతో మాట్లాడా. నేను సందీప్‌లా అవ్వలేను కానీ, మీకు రెండో కొడుకుగా నేను ఉన్నానని, అది మనసులో పెట్టుకోండని ఆంటీ అంకుల్‌కి చెప్పా. వాళ్లూ అలాగే నాతో మెలుగుతుంటారు.

ఇవీ చూడండి:

మేజర్ సందీప్​కు అడివి శేష్ నివాళులు

ఫిబ్ర'బరి'.. అన్​సీజన్​లో అదిరే వినోదం

tollywood movies 2021: కథ కంచికి.. కన్నీళ్లతో ఇంటికి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.