26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా 'మేజర్'. ఈ సినిమాలో అడివి శేష్.. సందీప్ పాత్రలో కనిపించనున్నారు. శనివారం ఈ సినిమాకు సంబంధించి 'లెటర్ టు సందీప్' పేరుతో ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్ర టీజర్‌ను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాను సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నిర్మిస్తుండగా.. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది జులై 2న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'టక్ జగదీష్'. రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లు. శనివారం ఈ చిత్రంలోని 'ఇంకోసారి ఇంకోసారి' అంటూ సాగే పాట మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">