ETV Bharat / sitara

సినిమాలకు త్రిష దూరం- పెళ్లే కారణమా? - త్రిష

సీనియర్ నటి త్రిష(trisha marriage) పెళ్లి టాపిక్ మరోసారి వార్తల్లోకెక్కింది. త్వరలోనే ఆమె పెళ్లి పీటలెక్కనున్నట్లు కోలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల త్రిష కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోకపోవడం.. ఆమె పెళ్లి వార్తలకు మరింత బలాన్ని చేకూర్చుతోంది.

trisha
త్రిష
author img

By

Published : Sep 1, 2021, 5:19 PM IST

ఒకప్పుడు తెలుగులో అగ్రకథానాయికగా రాణించి ఇప్పుడు కోలీవుడ్‌లో వరుస అవకాశాలతో అలరిస్తున్న నటి త్రిష(trisha marriage). మూడుపదుల వయసులో ఉన్న ఈ భామకు సంబంధించిన పెళ్లి వార్త మరోసారి చక్కర్లు కొడుతోంది. త్వరలోనే త్రిష ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు కోలీవుడ్​లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం త్రిష చేతిలో 'పొన్నియిన్‌ సెల్వన్‌', 'చదురంగ వేట్టై-2', 'రాంగీ', 'గర్జనై' వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో ఒక్క 'పొన్నియిన్‌ సెల్వన్‌' మినహా మిగిలిన చిత్రాల షూటింగ్‌తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్య క్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

trisha
త్రిష
దర్శక దిగ్గజం మణిరత్నం తెరెక్కిస్తున్న 'పొన్నియిన్‌ సెల్వన్‌'(Ponniyan selvan movie) చిత్రంలోని తన భాగం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఆ తర్వాత ఆమె ఏ ఒక్క చిత్రంలోనూ కమిటవలేదుట. అయితే పెళ్లి కారణంగానే త్రిష కొత్త ప్రాజెక్టులను అంగీకరించడం లేదన్నది కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇదే విషయాన్ని ఆమెకు సన్నిహిత వర్గాలు కూడా వెల్లడించాయి.ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే త్రిషనే స్పందించాలి. గతంలో వరుణ్‌ మణియన్‌ అనే వ్యాపారవేత్తతో త్రిషకు నిశ్చితార్థం జరిగింది. కానీ, కొన్ని రోజుల తర్వాత ఈ ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నారు.

ఇదీ చూడండి: త్రిష బర్త్​డే: నిషా కళ్ల చిన్నది ఈ ముద్దుగుమ్మ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.