ETV Bharat / sitara

రూమర్స్​పై హీరోయిన్​ సమంత క్లారిటీ - samantha movies

తనపై వస్తున్న రూమర్స్​కు చెక్​ పెట్టారు స్టార్​ హీరోయిన్​ సమంత(samantha marriage life). అందులో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే 'శాకుంతలం'(samantha shakuntala movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు సామ్​.

samantha
సమంత
author img

By

Published : Sep 29, 2021, 5:40 PM IST

స్టార్​ హీరోయిన్​ సమంత(Samantha movies list 2021) ముంబయిలో ఇల్లు కొనబోతున్నారని, త్వరలోనే అక్కడికి మకాం మార్చబోతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఇన్​స్టాలో లైవ్​లో అభిమానులతో ముచ్చటించిన సామ్​(samantha movies list) ఈ పుకార్లకు చెక్​ పెట్టారు. తాను ఎక్కడికీ వెళ్లట్లేదని స్పష్టం చేశారు.

'మీరు ముంబయికి షిఫ్ట్‌ అవుతున్నారంట. నిజమేనా?' అని ఓ అభిమాని అడగగా.. "ఇలాంటి రూమర్స్‌ ఎక్కడ నుంచి పుట్టుకొస్తాయో నాకు తెలియదు. ఇలా నాపై వచ్చే వందలాది రూమర్స్‌ నిజం కాదు. నేను ముంబయికి షిఫ్ట్‌ అవ్వడం లేదు. ఇప్పటికీ.. ఎప్పటికీ హైదరాబాద్‌లోనే నా ఇల్లు. ఈ నగరం నాకన్నీ ఇచ్చింది. భవిష్యత్తులోనూ ఇక్కడే ఉంటా" అంటూ తనపై వచ్చిన వదంతులకు చెక్‌ పెట్టారు ఈ యాపిల్‌ బ్యూటీ.

త్వరలోనే సామ్​.. గుణశేఖర్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'శాకుంతలం'(samantha shakuntala movie) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాగా, కొంతకాలం నుంచి సామ్​.. తన భర్త, హీరో నాగచైతన్యతో విడిపోయారంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే వారిద్దరూ స్పందించేవరకు వేచి ఉండాల్సిందే.

ఇదీ చూడండి: ఇప్పుడు వారే నాకు తోడు: సమంత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.