ETV Bharat / sitara

40 ఏళ్ల వయసులోనూ ఫిట్​నెస్​.. తగ్గేదే లే! - మాధురీ దీక్షిత్

40 ఏళ్ల వయసులోనూ కొందరు బాలీవుడ్​ హీరోయిన్లు తమ ఫిట్​నెస్​తో ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నారు. వారెవరో చూద్దాం.

Actresses over 40 who are the epitomes of fitness
40 ఏళ్ల వయసులోనూ ఫిట్​నెస్​.. తగ్గేదే లే!
author img

By

Published : Mar 13, 2021, 9:32 AM IST

ఫిట్​నెస్.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందరూ దీని గురించి ఎక్కువగా పట్టించుకోకపోవచ్చు. కానీ సెలిబ్రిటీలు, క్రీడాకారులు చాలా సీరియస్​గా తీసుకుంటారు. ఈ మధ్య పురుషులు సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్​పై దృష్టిసారిస్తే, మహిళలు జీరోసైజ్​తో నాజూగ్గా కనిపించడానికి మక్కువ చూపుతున్నారు. యుక్త వయసులో ఉన్న వారు ఈ ట్రెండ్​ను ఎక్కువగా అనుసరిస్తారు. కానీ కొంతమంది హీరోయిన్లు 40 ఏళ్లు దాటినా వారి అదిరిపోయే ఫిట్​నెస్​తో ఆకట్టుకుంటున్నారు. వారెవరో చూద్దాం.

మలైకా అరోరా

ఫిట్​నెస్, ఫ్యాషన్ విషయంలో అందరికంటే ముందుంటుంది మలైకా అరోరా. 46 ఏళ్ల ఈ సీనియర్ నటి 'దివా యోగా' అనే సెంటర్​ను నిర్వహిస్తోంది. సోషల్​ మీడియాలో ఫొటోలు, వీడియాలతో ఫిట్​నెస్ పాఠాలు చెబుతోంది.

శిల్పాశెట్టి

బాలీవుడ్​తో పాటు దక్షిణాదిలోనూ ఓ వెలుగు వెలిగిన తార శిల్పాశెట్టి. ప్రస్తుతం బిజినెస్​ చూసుకుంటోంది. అలాగే తన జీవితంలో ఫిట్​నెస్​కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని చెబుతోంది. అందుకే ఇంట్లోనే పూర్తిస్థాయి జిమ్​ను ఏర్పాటు చేసుకుంది. జిమ్​తో పాటు 40 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే యోగాసనాలతో అలరిస్తోంది. నెటిజన్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

కరిష్మా కపూర్

ఇద్దరు పిల్లల తల్లయిన కరిష్మా కపూర్.. ఇటీవల సెల్ఫీతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫిట్​నెస్​తో కూడిన బాడీతో యువ హీరోయిన్లకు సవాల్ విసురుతోంది.

మాధురీ దీక్షిత్

శిల్పాశెట్టిలాగే మాధురీ దీక్షిత్​కూ ఇంట్లో జిమ్ ఉంది. అప్పుడప్పుడూ ఇన్​స్టాగ్రామ్​లో తన జిమ్ వర్కవుట్ వీడియోలతో అభిమానులను పలకరిస్తూ ఉంటుంది.

సుస్మితా సేన్

మిస్ యూనివర్స్, సీనియర్ నటి సుస్మితా సేన్​ 45 ఏళ్ల వయసులోనూ తన ఫిట్​నెస్​లో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. భర్త రోహ్మన్​ షాల్​తో కలిసి కపుల్ యోగా చేస్తూ అదరగొడుతోంది.

మందిరా బేడీ

మందిరా బేడీ జీవితంలో ఫిట్​నెస్​ అనేది ఓ భాగమైపోయింది. #Fitstgram అనే హ్యాష్​ట్యాగ్​తో ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ ఉంటుంది. 48 ఏళ్ల ఈ హీరోయిన్ తన ఫిజికల్ అప్పియరెన్స్​తో ఎప్పుడూ ప్రేక్షకుల్ని సర్​ప్రైజ్ చేస్తూనే ఉంటుంది.

ఇవీ చూడండి: బాలీవుడ్​లో బయోపిక్​ల హవా.. ఏ చిత్రం హిట్టో మరి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.