ETV Bharat / sitara

ఇకపై నయన్​-విఘ్నేశ్​ మకాం అక్కడే! - nayanthara's house

Nayantara new house: హీరోయిన్​ నయనతార.. రజనీకాంత్‌, ధనుష్‌ వంటి సెలబ్రిటీలు నివసిస్తున్న పోయస్‌ గార్డెన్‌లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిందని సమాచారం. త్వరలోనే తన ప్రియుడు విఘ్నేశ్​ను వివాహం చేసుకుని ఆమె గృహప్రవేశం​ చేయనుందని తెలిసింది.

కొత్త ఇల్లు కొన్న నయనతార, nayantara buys a new house in Rajnikanth area
కొత్త ఇల్లు కొన్న నయనతార
author img

By

Published : Nov 27, 2021, 4:20 PM IST

nayanthara residence: స్టార్​ హీరోయిన్​ నయనతార.. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే కాబోయే భర్త విఘ్నేశ్​శివన్​తో కలిసి పలు సినిమాలను నిర్మిస్తోంది. కాగా, నయన్​కు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం కోలీవుడ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం చెన్నై నగరంలోని ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో ఉంటోన్న నయన్‌-విఘ్నేశ్​.. త్వరలోనే కొత్త ఇంటికి మకాం మార్చనున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌, ధనుష్‌ వంటి సెలబ్రిటీలు నివసిస్తున్న పోయస్‌ గార్డెన్‌లో ఓ ఖరీదైన ఇంటిని వారు కొనుగోలు చేశారట.

నాలుగు పడక గదులతో ఉన్న ఈ ఇంటి కోసం నయన్‌ పెద్దమొత్తంలో ఖర్చు పెట్టారని.. త్వరలోనే విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి ఆమె గృహప్రవేశం చేయనున్నారని సమాచారం. అంతేకాకుండా ఇదే ప్రాంతంలో ఆమె త్వరలోనే మరో ఇంటిని సైతం కొనుగోలు చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న నయన్‌-విఘ్నేశ్‌ వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. వివాహం తర్వాత ఈ జంట నివసించడం కోసమే కొత్త ఇంటిని కొనుగోలు చేసి ఉంటారని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నయన్‌ తెలుగులో తెరకెక్కుతోన్న 'గాడ్‌ ఫాదర్‌', తమిళంలో 'కాతువక్కుల రెందు కాదల్‌', 'కనెక్ట్‌' చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి: 'ఆర్ఆర్ఆర్'లో ఆలియా భట్​ పాత్ర 15 నిమిషాలేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.