నటి మంచు లక్ష్మీప్రసన్న(manchu lakshmi new movie) ఆచి తూచి సినిమాలు చేస్తుంటారు. ఆమె నటించింది తక్కువ సినిమాల్లోనే అయినా హిందీతోపాటు తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు ఉంది. తాజాగా మలయాళంలోనూ ఆమె అవకాశం అందుకున్నట్లు తెలిసింది. అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కనున్న 'మాన్‌స్టర్'లో(Mohanlal new movie) లక్ష్మీప్రసన్న ఓ కీలక పాత్రకు ఎంపికైనట్టు సమాచారం. థ్రిల్లర్ కథతో ఈ చిత్రం రూపొందనుందట!
మోహన్‌బాబు తనయగా చిత్ర పరిశ్రమకు పరిచయయ్యారు మంచు లక్ష్మి. వ్యాఖ్యాతగా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆంగ్లంలో కూడా సినిమాలు చేశారు. మొదటి చిత్రం 'అనగనగా ఓ ధీరుడు'తో ప్రతినాయకురాలు ఐరేంద్రిగా నటించి అందరి ప్రశంసలూ అందుకోవడమే కాదు, ఉత్తమ విలన్‌గా నంది అవార్డును కూడా అందుకున్నారు. ఆ తర్వాత 'దొంగల ముఠా', 'చందమామ కథలు', 'గుండెల్లో గోదారి', 'దొంగాట', 'లక్ష్మీబాంబ్' సహా పలు చిత్రాల్లో నటించారు. చివరిసారిగా పిట్టకథలు వెబ్‌సిరీస్‌లో కనిపించారు.
కాగా, మోహన్‌లాల్ త్వరలోనే 'మరక్కర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతోపాటే ఆరట్టు, రామ్, బరోజ్, బ్రో డ్యాడి, అలోన్ సహా పలు సినిమాల్లో నటిస్తున్నారు.
ఇదీ చూడండి: బ్లూ డ్రెస్సులో మంచు లక్ష్మీ ఫోజులు