సినిమాల్లో హీరోయిన్ను హీరో ప్రేమించడం, తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం సాధారణమే. అది తెరపై కాబట్టి పెద్దగా పట్టింపు ఉండదు. ఆఫ్‌స్క్రీన్‌లో అయితే కొంచెం ఇబ్బందే. తాజాగా కన్నడ చిత్రసీమలో ఇలాంటి ఘటనే జరిగింది. శాండిల్‌వుడ్ నటి విజయలక్ష్మి, 'తుంగభద్ర' చిత్ర దర్శకుడు కలిసి ఎక్కడికో వెళ్లిపోయారు.
తుంగభద్ర సినిమా దర్శకుడు అంజప్ప, నటి విజయలక్ష్మి కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. గత వారం రాయ్‌చూర్‌లోని సినిమా సెట్ నుంచి వారిద్దరూ కలిసి వెళ్లిపోయారు. ఇటీవలే విజయలక్ష్మి బామ్మ చనిపోయారు. హీరోయిన్ తల్లి కూడా అనారోగ్యంపాలై మండ్య మిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయినా ఆ నటి ఇంటికి రాలేదు.
సినిమా చిత్రీకరణ పూర్తి కాకముందే దర్శకుడు, హీరోయిన్ మాయం కావడంపై నిర్మాత షాక్ అయ్యాడు. ఈ ఘటనతో తనకు చాలా నష్టం జరిగిందని, ఆ డబ్బు విజయలక్ష్మి తల్లిదండ్రులే ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చాలా సినిమాలకు ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నానని, అడ్వాన్సూ తీసుకుందని ఆరోపించాడు. దర్శకుడు-హీరోయిన్ ప్రేమాయణం వ్యవహారం చన్నపట్టణ పోలీసు స్టేషన్‌కు చేరింది. పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
ఇదీ చదవండి: దర్బార్ క్రేజ్: చెన్నైలో ఫ్యాన్స్ రచ్చ.. రచ్చ