బాధ్యతలను లింగభేదంతో పంచుకోకూడదని బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా అంటున్నారు. ప్రముఖ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. ఇటీవలే రచయితగా మారి పలు పుస్తకాలను రాశారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్వింకిల్ మాట్లాడుతూ.. మహిళలు మాత్రమే ఇంటి పనులు చేయాలని ఎందుకు ఆశిస్తున్నారని ప్రశ్నించారు. ఇంటి పనుల్లో లింగభేదం చూపించడం సరికాదని పేర్కొన్నారు.
"బాధ్యతలను మహిళలు, పురుషులు సమానంగా పంచుకోవాలి. వారి నైపుణ్యాలను బట్టి పనులు చక్కదిద్దుకోవాలి. నన్ను వంటింట్లోకి వెళ్లి వంట చేయమంటే నాకు బాధేస్తుంది. చాలా ఒత్తిడికి గురవుతాను. అదే మా ఆయన(అక్షయ్‌కుమార్), పిల్లలు బాగా వంట చేస్తారు. వండటాన్ని ఎంజాయ్ చేస్తారు. సంగీతం వింటూ రుచికరమైన వంటకాలు చేసిపెడతారు. నాకు వంట చేయాలంటే భయం. కానీ వస్తువులను చక్కగా సర్దిపెట్టడాన్ని ఇష్టపడతా. కొనుక్కొచ్చిన కిరాణా సామగ్రి, ఇతర వస్తువులను ఇంట్లో చక్కగా సర్దేస్తా. అందుకే ప్రతి ఒక్కరు ఇంట్లో పనుల్ని వారి వారి నైపుణ్యాల్ని బట్టి విభజించి చేసుకోవాలి" అని ట్వింకిల్ ఖన్నా తెలిపారు.
ఇదీ చూడండి:'ప్రభాస్21' భామ వరల్డ్ రికార్డు గురించి విన్నారా?