ETV Bharat / sitara

ట్వింకిల్​ ట్వింకిల్​ 'బ్యూటిఫుల్​' స్టార్​! - అక్షయ్​ కుమార్​ ట్వింకిల్​ ఖన్నా

"అల్లో నేరేడు కళ్ల దానా...నీ వల్లో పడ్డానే పిల్లదానా" అనే వర్ణనకు తగ్గట్టుగా ఉంటుంది బాలీవుడ్‌ భామ ట్వింకిల్‌ ఖన్నా. అసలు పేరు టీనా జతిన్‌ ఖన్నా. నటిగానే కాక నిర్మాతగా, వ్యాపార వేత్తగా, ఆర్కిటెక్టుగా, ఇంటీరియర్‌ డిజైనర్‌గా, పుస్తక రచయిత్రిగా, దినపత్రిక కాలమిస్టుగా, ఇలా ఒక్కటేమిటి అన్ని రంగాల్లో ఔరా అనిపించేలా ప్రతిభ చూపింది ట్వింకిల్‌ ఖన్నా. మంగళవారం (డిసెంబరు 29) ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని విశేషాలు మీకోసం.

actress twinkle khanna birthday special story
ట్వింకిల్​ ట్వింకిల్​ 'బ్యూటిఫుల్​' స్టార్​!
author img

By

Published : Dec 29, 2020, 5:33 AM IST

ఆమె అందానికే అందం. తల్లితండ్రుల నుంచి స్వీకరించిన ముగ్ధ స్నిగ్ద సౌందర్యానికి ఎత్తిన పతాక. స్వీట్‌ నథింగ్స్‌ చెప్పే నయనాలలో మిలమిల మెరిసే తళుకులు.. పెదాల్లో ఎర్రని మెరుపులు.. చెక్కిళ్లలో పూసే చామంతులు.. సన్నజాజి తీగను తలపించే సన్ననైన శరీరాకృతి.. ఏ కవి రాయని శృంగార కృతి ఆమె. మాటాడితే కీర్తనం.. నడిస్తే నర్తనం.. నటిస్తే సమ్మోహనం.. వెరసి ఆమె ట్వింకిల్‌ ఖన్నా.

తొలిచిత్రం 'బాబీ'తో భారతీయుల్ని వెర్రెక్కించిన అలనాటి అత్యద్భుత సౌందర్య రాశి డింపుల్‌ ఖన్నా గారాల పట్టి ట్వింకిల్‌ ఖన్నా. తన కాబోయే భర్త అచ్చం ఇలాగే ఉండాలని అప్పట్లో ఆశపడిన ఆడపిల్ల కలల రాకుమారుడు.. వరుస విజయాల హీమాన్‌.. రాజేశ్​ ఖన్నా ట్వింకిల్‌కు తండ్రి. ప్రస్తుతం తెరకు దూరంగా ఉన్నా.. ట్వింకిల్‌ ఇప్పటికీ అభిమానుల గుండెల్లో కుండపోతగా కురిసే గులాబీ అత్తరే. అంతలా తన నటనతో ప్రేక్షకుల మనసులు దోచేసుకుంది. మంగళవారం (డిసెంబరు 29) ట్వింకిల్​ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

actress twinkle khanna birthday special story
ట్వింకిల్​ ఖన్నా

హీరోతో డేటింగ్​

ఎవరిదైనా పుట్టినరోజు అని తెలిస్తే వారికి ప్రత్యేక బహుమతులను ఇచ్చి ఆశ్చర్యపరచాలని తమ ఆత్మీయులను భావిస్తుంటారు. అయితే బాలీవుడ్​ నటి ట్వింకిల్​ ఖన్నా విషయంలో మాత్రం అది నిజంగానే అందుకు భిన్నంగా జరిగిందట. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఓ హీరో తనకు పేపర్​ వెయిట్​ గిఫ్ట్​గా ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారని ట్వింకిల్ ఖన్నా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ఆ హీరో ఎవరు? ట్వింకిల్​ ఖన్నాకు అతడికి సంబంధం ఏమిటి? అనే విషయాలను తెలుసుకుందాం.
ట్వింకిల్​ ఖన్నాకు బర్త్​డే గిఫ్ట్​గా పేపర్​ వెయిట్​ ఇచ్చింది ఎవరో కాదు! ఆమె భర్త హీరో అక్షయ్​ కుమార్. ట్వింకిల్​ ఖన్నాతో అక్షయ్​ డేటింగ్​లో ఉన్నప్పుడు.. ఆమె బర్త్​డే అన్న సంగతి అక్షయ్​కు గుర్తు లేదట. ఆ తర్వాత గుర్తుకువచ్చేసరికి బయటికి వెళ్లి బహుమతి కొనేంత సమయంలేక ఇంట్లోనే ఉన్న పేపర్​ వెయిట్​ను కానుకగా ఇచ్చారట. అయితే తనకు ఎప్పటికైనా తన కోసం ఓ డైమండ్​ రింగ్​ కొనివ్వాలని ఆమె కోరగా.. అక్షయ్​ ఆమె కోరికను తీర్చారని ఓ సందర్భంగా చెప్పుకొచ్చింది.

భర్త అక్షయ్ కుమార్​తో ట్వింకిల్​ ఖన్నా

వ్యక్తిగతం

ట్వింకిల్​ ఖన్నా.. 1974 డిసెంబరు 29న ముంబయిలో జన్మించింది. రాజేశ్​ ఖన్నా, డింపుల్​ కపాడియాల పెద్ద కుమార్తె ట్వింకిల్ ఖన్నా. ఆమెకు రింకీ ఖన్నా అనే సోదరి ఉంది. ఆమె కూడా బాలీవుడ్​ నటే. విశేషమేమిటంటే ఆమె తండ్రి రాజేశ్ ఖన్నా పుట్టినరోజు కూడా డిసెంబరు 29నే.

తెరంగేట్రం

1995లో రాజ్‌ కుమార్‌ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కిన 'బర్సాత్‌' అనే సినిమాతో ట్వింకిల్‌ ఖన్నా వెండితెరకు పరిచయమయ్యింది. ప్రముఖ నటుడు బాబీ డియోల్‌కూ ఇదే మొదటి సినిమా. ఈ సినిమా విడుదలకు ముందు ట్వింకిల్‌ ఖన్నా మరో రెండు ప్రాజెక్టులకు సైన్‌ చేశారు. 'బర్సాత్‌' సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. ఆ ఏడాది ఎక్కువ వసూళ్లు రాబట్టిన ఆరో సినిమాగా పేరుగాంచింది. ఆ మరుసటి ఏడాది 'జాన్‌', 'దిల్‌ తేరా దివానా' అనే సినిమాలలో నటించారు ట్వింకిల్‌ ఖన్నా. సల్మాన్‌తో సక్సెస్‌ 1997లో, 'ఉఫ్‌! యే మొహబ్బత్‌', 'ఇతిహాస్‌' చిత్రాలు విడుదల అయ్యాయి. అయితే, ఈ రెండు సినిమాలు కూడా ట్వింకిల్‌ ఖన్నాని నిరుత్సాహపరిచాయి. 1998లో విడుదలైన ఏకైక ట్వింకిల్‌ ఖన్నా సినిమా 'జబ్‌ ప్యార్‌ కిసీసే హోతా హై'. ఈ చిత్రంలో సినిమాలో సల్మాన్‌ ఖాన్‌తో కలిసి నటించింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం అందుకుంది.

టాలీవుడ్‌ ఎంట్రీ

విక్టరీ వెంకటేశ్​ హీరోగా తెరకెక్కిన 'శీను' చిత్రంలో ట్వింకిల్​ ఖన్నా హీరోయిన్​గా టాలీవుడ్​లో అరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

సొంత నిర్మాణ సంస్థ

మిసెస్‌ ఫన్నీ బోన్స్‌ మూవీస్‌ అనే నిర్మాణ సంస్థను సొంతంగా ప్రారంభించింది ట్వింకిల్‌ ఖన్నా. అసాధారణమైన సినిమాలతో పాటు కమర్షియల్‌ విలువలు ఉన్న సినిమాలనూ ఈ సంస్థ ద్వారా నిర్మించారు. అక్షయ్​ కుమార్​ నటించిన ప్యాడ్​ మ్యాన్​ చిత్రానికి ఈమె కూడా సహ-నిర్మాతగా వ్యవహరించింది.

తెరవెనుక

తెరపై కాకుండా తెర వెనుక కూడా ట్వింకిల్​ ఖన్నా క్రియాశీలక పాత్రల్లో రాణించింది. 2001లో న్యూదిల్లీలో అప్పటి ఎన్నికలలో పాల్గొన్న తన తండ్రి కోసం ప్రచారం చేసింది. 2000లో ఫెమినా మిస్‌ ఇండియాలో ఒక జడ్జిగా వ్యవహరించింది. 2001లో ఫెరోజ్‌ ఖాన్‌ వారి 'ఆల్‌ ది బెస్ట్‌' అనే నాటకంలో ఒక ప్రముఖ పాత్రను పోషించింది. 2002లో ముంబయిలోని 'ద వైట్‌ విండో' అనే ఇంటీరియర్‌ డిజైన్‌ స్టోర్‌ని ప్రారంభించింది. ఈ స్టోర్‌కు ఎల్లే డెకర్‌ ఇంటర్నేషనల్‌ డిజైన్‌ అవార్డు లభించింది. దాంతో, ముంబయిలోనే మరొక శాఖను ప్రారంభించింది.

ట్వింకిల్‌కు ప్రొఫెషనల్‌ డిగ్రీ లేకపోయినా ఆర్కిటెక్ట్‌తో కలిసి రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉంది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు, కంప్యూటర్‌ సహాయంతో మ్యాప్​లు, డిజైన్లను సాధన చేసేది. ప్రముఖ కథానాయికలు రాణి ముఖర్జీ, రీమా సేన్, టబు ఇల్లులకు ఇంటీరియర్‌ డిజైనింగ్‌ చేసింది. 2008లో కరీనా కపూర్‌ బాంద్రా ఫ్లాట్‌కు కూడా ట్వింకిల్‌ ఖన్నానే ఇంటీరియర్‌ పనులు చూసుకుంది.

బ్రాండ్‌ అంబాసిడర్‌గా

వాచ్‌ బ్రాండ్‌ 'మోవాడో'కు బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ ట్వింకిల్​ ఖన్నా వ్యవహరించింది. అలాగే 'కోకో కోల', 'మైక్రో మాక్స్‌ మొబైల్‌'లకూ ఎండోర్స్‌ చేసింది. 'లోరియల్‌'కు భారత ప్రచారకర్తగా.. 'డిఎన్‌ఏ', 'టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా' పత్రికలకు కాలమిస్ట్‌గా పనిచేసింది. ట్వింకిల్‌ ఖన్నా రచించిన 'మిసెస్‌ ఫన్నీ బోన్స్‌' పుస్తకం ముంబయిలోని క్రాస్‌వర్డ్స్‌ కెంప్స్‌ కార్నర్‌ స్టోర్‌కు చెందిన బెస్ట్‌ సెల్లర్‌ చార్టులో మొదటి స్థానానికి చేరుకుని.. పాఠకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.

ట్వింకిల్‌ ఖన్నా రచించిన రెండవ పుస్తకం పేరు 'ద లెజెండ్‌ ఆఫ్‌ లక్ష్మీ ప్రసాద్‌'. ఇందులో నాలుగు షార్ట్‌ స్టోరీస్‌ ఉంటాయి. 2016 నవంబర్‌లో విడుదలైన ఈ పుస్తకం లక్ష కాపీలపైనే అమ్ముడుపోయింది. 2018లో ట్వింకిల్‌ ఖన్నా రచించిన 'పైజామాస్‌ ఆర్‌ ఫర్‌ గివింగ్‌' విడుదల అయింది. ఈ పుస్తకానికీ పాఠకుల నుంచి విశేష స్పందన లభించింది.

మహిళల్లో అవగాహన కోసం

ఋతు సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత గురించి చెప్పే కార్యక్రమాలలో చురుగ్గా ట్వింకిల్‌ ఖన్నా పాల్గొంటుంది. పిల్లలు, మురికివాడ వర్గాలలో ఋతు పరిశుభ్రత హక్కును ప్రోత్సహించడానికి ఆమె 'సేవ్‌ ది చిల్డ్రన్​'తో చేతులు కలిపింది. ఈ విషయాలకు సంబంధించి మాట్లాడడానికి ఆమెను ప్రతిష్టాత్మకమైన ఆక్స్ఫర్డ్‌ యూనియన్‌ వారు ఆహ్వానించారు. బీబీసీ ఛానల్‌లో 'ఇంపాక్ట్‌' అనే షోలో కూడా ప్రపంచవ్యాప్త ఋతు పరిశుభ్రత, పారిశుద్ధ్యం గురించి మాట్లాడింది.

పురస్కారాలు

* 1996లో 'బర్సాత్‌' సినిమాకు బెస్ట్‌ ఫీమేల్‌ డెబ్యూగా ఓ ఫిలింఫేర్‌ పురస్కారాన్ని ట్వింకిల్ ఖన్నా అందుకుంది.

* 2010లో మోస్ట్‌ స్టైలిష్‌ కపుల్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా 'హలో! హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌' అవార్డును తన భర్త అక్షయ్‌ కుమార్‌తో కలిసి అందుకుంది.

* 2016లో 'ఇన్స్పైరింగ్‌ వుమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా అవుట్‌ లుక్‌ సోషల్‌ మీడియా పురస్కారాన్ని కైవసం చేసుకోగలిగింది. ఆ ఏడాది 'మిసెస్‌ ఫన్నీ బోన్స్‌' పుస్తకానికి క్రాస్‌ వర్డ్‌ పాపులర్‌ నాన్‌ ఫిక్షన్‌ పురస్కారం లభించింది.

* 2017లో 'హలో! హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌' అవార్డు నుంచి 'విజనరీ విమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా గుర్తింపు తెచ్చుకుంది. అదే ఏడాదిలో 'ద లెజెండ్‌ ఆఫ్‌ లక్ష్మీ ప్రసాద్‌' పుస్తకానికి ఇండియా టుడే 'ఉమెన్‌ రైటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా మరో పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది ట్వింకిల్‌ ఖన్నా.

* 2017లోనే 'వోగ్‌ ఒపీనియన్‌ మేకర్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా గుర్తింపు లభించింది. అదే ఏడాది ఆమె రచించిన 'ద లెజెండ్‌ ఆఫ్‌ లక్ష్మీ ప్రసాద్‌' పుస్తకానికి బెంగుళూరు లిటరేచర్‌ ఫెస్టివల్‌లో 'పాపులర్‌ ఛాయస్‌' అవార్డు లభించింది.

ఇదీ చూడండి: నా యాసపై కామెంట్లు చేసినప్పుడు బాధేసింది: దీపిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.