ETV Bharat / sitara

Shruthi Hassan: నేనూ సగటు ఆడపిల్లలాగనే కదా..! - తాజా వార్తలు

‘తెరిచిన పుస్తకం’- శ్రుతి హాసన్‌ గురించి తెలిసినవాళ్లు చెప్పే మాటిది. మనసులోనే కాదు.. తన జీవితంలో జరిగే దేన్నీ దాచుకోదు మరి! సూటిగా మాట్లాడటం.. సొంతంగా తన కాళ్లపై తాను నిలబడాలనే పట్టుదల.. తప్పొప్పులతో సంబంధం లేకుండా తన నిర్ణయాలపై దృఢంగా నిలబడగలిగే తత్వం ఆమె సొంతం. అందుకే.. తండ్రికి వారసులిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినా.. శ్రుతిగానే అందరికీ దగ్గరైంది. ఆమెను తాజాగా ‘వసుంధర’ పలకరించింది.

sruthi
sruthi
author img

By

Published : Aug 29, 2021, 8:11 AM IST

లాక్‌డౌన్‌ తర్వాత తిరిగి సినిమా సెట్‌లోకి అడుగుపెట్టడం చాలా బాగుంది. భయమంతా పోయిందని అబద్ధమైతే చెప్పను. కానీ.. ఎన్నాళ్లని భయపడుతూ కూర్చుంటాం. నాకూ కొన్ని ఆర్థిక అవసరాలుంటాయి కదా! ఇది వినగానే చాలామంది ‘అదేంటండీ, మీకు ఆర్థిక ఇబ్బందులేంటి’ అని ఆశ్చర్యపోతారు. ‘మీరు స్టార్‌ కదా!’ అంటారు. సంపాదించే మొత్తాల్లో తేడా ఉంటుంది కానీ నేనూ బిల్స్‌ చెల్లించాలి. అందుకు డబ్బులు కావాలిగా! ‘కమల్‌ హాసన్‌ తనయ..’ అని విన్నప్పుడు చాలా బాగుంటుంది. నేనూ సగటు ఆడపిల్లలాగే నాన్న కూతుర్ని అనిపించుకోవడానికి ఇష్టపడతాను. కానీ అన్నింటికీ ఆయనపై ఆధారపడటం నచ్చదు. అందుకే మొదటి సినిమా తర్వాత ఎప్పుడూ నాన్నని డబ్బు అడగలేదు. ఖర్చు పెట్టే ప్రతి రూపాయీ నేను సంపాదించిందే. ఆయన నుంచి ప్రేమ, ధైర్యం, కరుణలను మాత్రం ఆస్తులుగా తెచ్చుకున్నా.

నా తీరిదీ!

అందరిలాగే నేనూ. నా జీవితంలో జరిగే ప్రతిదీ అందరితో పంచుకుంటా. దేన్నయినా గోప్యంగా ఉంచాల్సిన అవసరమేముంది అనుకుంటా. అందుకనే నా ప్రేమ దగ్గర్నుంచి బ్రేకప్‌, కాస్మెటిక్‌ సర్జరీ, డిప్రెషన్‌, పీసీఓడీ..ఇలా దేన్నీ దాయలేదు. అలాగని వేరే వాళ్లు అలా లేకున్నా తప్పు పట్టను. నా వరకూ వందశాతం నచ్చినట్లుగా ఉండటానికే ప్రయత్నిస్తా. ఏదయినా నిజాయతీగా చేయాలనుకుంటా. స్టార్‌ కూతురిగా కంటే స్వతంత్ర మహిళ అనిపించుకోవడానికే ఇష్టపడతా. ఈ కారణంగానే వృత్తిపరంగా నాన్న సాయం ఎప్పుడూ తీసుకోలేదు. ఏం చేస్తున్నానో చెబుతుంటా. ఫలానా పని చేయాలా వద్దా అని సలహాలడగను. ఆయనా మేం ఏకరువు పెట్టాలనుకోరు. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడం, స్వతంత్ర భావాలతో బతకడం నాన్నే మాకు నేర్పించారు.

తండ్రితో తనయ
తండ్రితో తనయ

ఆ ఆలోచనతో వచ్చా..

రెండు సినిమాలు చేసి, ఆ డబ్బుతో రాక్‌ బ్యాండ్‌ ప్రారంభించాలన్నది నా ఆలోచన. కానీ వచ్చాక దీనిపై ఇష్టం పెరిగింది. జీవితం పరుగు పందెం కాదన్న సంగతీ ఇక్కడికొచ్చాకే అర్థమైంది. అప్పట్నుంచి ప్రతి రోజునీ, చేసే ప్రతి పాత్రనీ ఆస్వాదించడం అలవాటు చేసుకున్నా. అందుకే ఈ రోజు నేనేం నేర్చుకోవచ్చనే ఆలోచిస్తా తప్ప, అందరికంటే ముందుండాలి, ఎక్కువ సినిమాలు ఒప్పుకోవాలనుకోను. కాకపోతే వ్యక్తిగా ప్రతిరోజూ ఇంకా ఉత్తమంగా అవ్వాలని మాత్రం అనుకుంటా. ఈ పన్నెండేళ్ల సినీ ప్రయాణంలో నా కెరీర్‌లో నాకు మంచి పాత్రలు దక్కింది తెలుగులోనే. అందుకే టాలీవుడ్‌కి నా మనసులో ప్రత్యేకమైన స్థానం. ఇక్కడ నేను చేసిన ప్రతి సినిమా నా హృదయానికి దగ్గరైందే. వాటిలో అందరూ కమర్షియల్‌ కథానాయికనే చూశారేమో కానీ, నా వరకూ అవి అందమైన మహిళా పాత్రలు. ఇటీవల ‘క్రాక్‌’లో తల్లిగా, భార్యగా బలమైన మహిళగా కనిపించా. స్వతహాగా నాకు యాక్షన్‌ సినిమాలంటే ఇష్టం. ఫిట్‌నెస్‌పై మక్కువ ఎక్కువ. అందుకే ఈ పాత్ర సహజంగా కనిపిస్తుంది. కలల పాత్రలంటూ ప్రత్యేక కోరికలేమీ పెట్టుకోను. కానీ.. సంగీతకారిణిగా చేసే అవకాశమొస్తే మాత్రం అస్సలు వదులుకోను.

అవి ఎదురైనపుడు..

తారలన్నాక రూమర్లు సహజం. అలాగే అమ్మానాన్నా విడిపోవడం దగ్గర్నుంచి.. నా మేకప్‌ వరకూ ప్రతిదాన్నీ ప్రశ్నిస్తారు. కానీ నేనవేమీ పట్టించుకోను. అమ్మానాన్నా విడిపోయినందుకు నాకేం బాధ లేదు. వాళ్లిద్దరూ మంచివాళ్లు, మమ్మల్ని బాగా చూసుకుంటారు. కలిసి జీవించలేకపోయారంతే. మిగతాదంతా అందరిలాగే. డిప్రెషన్‌లోకి వెళ్లినపుడు ఎన్నో వ్యతిరేక కామెంట్లు, ఓసారి నల్ల లిప్‌స్టిక్‌ వేసుకున్నానని దూషించారు. ఇంకా ఎన్నో వచ్చాయి. అన్నీ విని ఊరుకుంటా లేదా వాటిలో పాజిటివిటీ వెతుకుతా. పెదాలకు నలుపు వేసుకుంటే తిట్టారు, ఎరుపు వేసుకున్నంత మాత్రాన నాకేం ప్రైజ్‌ ఇవ్వట్లేదు కదా! ఇదీ అంతే అని వదిలేస్తా. అందరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదని నా అభిప్రాయం.

రహస్యాలుండవు..

‘పెళ్లి ఎప్పుడు?’ ఈమధ్య ఎవరితో మాట్లాడినా ఇదే ప్రశ్న. ముందే చెప్పినట్టు నా దగ్గర రహస్యాలేమీ ఉండవు. పెళ్లి చేసుకోవాలనిపిస్తే మరుక్షణమే అందరికీ చెప్పేస్తా. ప్రస్తుతానికైతే ఆ ఆలోచనలేమీ లేవు. శాంతను హజారికా నా బెస్ట్‌ ఫ్రెండ్‌. తను ప్రతిభగల ఆర్టిస్ట్‌. సంగీతం, కళలు, సినిమాల పరంగా మా ఇద్దరి అభిరుచులు కలిశాయి. తనతో కలిసి సమయం గడపడం చాలా ఇష్టం. తనపై నాకు ఎంతో గౌరవం కూడా.

ప్రస్తుతం.. సలార్‌లో ప్రభాస్‌తో కలిసి నటిస్తున్నా. తన ఆతిథ్యం గురించి విన్నా కానీ ఈ సినిమాతో అనుభవంలోకి వచ్చింది. తను రోజూ పంపే వంటకాలను చూసి నన్ను నేను నియంత్రించుకోలేకపోయా. ప్రేమతో కూడిన ఆతిథ్యం తనది. దీంతోపాటు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కోసం ఓ హిందీ సిరీస్‌నూ చేస్తున్నా.

ఇదీ చూడండి: ఒక్క సీన్​కు 35 టేకులు.. సినిమా చేయనన్న జెనీలియా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.