ప్రముఖ హాలీవుడ్ నటి స్కార్లెట్ జోహన్సన్ మూడో పెళ్లి చేసుకుంది. హాలీవుడ్ హాస్యనటుడైన కోలిన్ జోస్ట్ని వివాహం చేసుకుంది. గత మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్న వీరు మే నెల 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో వృద్ధులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్న మీల్స్ ఆన్ వీల్స్ అనే స్వచ్ఛంద సంస్థ గురువారం ఈ వివాహ వార్తను ప్రకటించింది.
ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటీమణుల్లో స్కార్లెట్ ఒకరు. 'అవెంజర్స్' సిరీస్‌లో బ్లాక్ విడో పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. 'అవెంజర్స్' ద్వారా ఆమెకు భారీ పారితోషికం అందుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న వంద మంది సెలబ్రిటీలతో ఫోర్బ్స్ విడుదల చేసే జాబితాలోనూ ఎన్నోసార్లు చోటు దక్కించుకుంది స్కార్లెట్.
స్కార్లెట్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుంది. హాలీవుడ్ నటుడు ర్యాన్ రేనాల్డ్స్ , మరొకరు ఫ్రెంచి వ్యాపారవేత్త రోమైన్ డౌరియాక్. స్కార్లెట్‌కి ఒక కుమార్తె కూడా ఉంది. ఇప్పుడు కోలిన్‌కి ఇది మొదటి పెళ్లి కాగా స్కార్లెట్‌కి ఇది ముచ్చటగా మూడో పెళ్లి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">