'ఏమాయ చేసావె' చిత్రంతో ప్రేమలో పడిన నాగచైతన్య-సమంత... కొన్ని సంవత్సరాల తర్వాత పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఇటీవలే 'మజిలీ' చిత్రంలో జంటగా నటించి ప్రేక్షకుల మనసులు గెల్చుకున్నారు. తాజాగా మంచులక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ఫీట్ అప్ విత్ స్టార్స్' కార్యక్రమానికి హాజరైన ఈ అమ్మడు.. తన భర్త చైతూ గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడించింది.
వ్యక్తిగత విషయంపై సమంతకు ఓ ప్రశ్న వేసింది మంచులక్ష్మి. " పెళ్లికి ముందుకు చై, నువ్వు సహజీవనం చేశారట కదా? నువ్వు సింగిల్‌గా ఉన్నప్పుడు, చైతో కలిసి ఉన్నప్పుడు బెడ్రూంలో వచ్చిన మార్పులు ఏంటి?" అని సరదాగా అడిగింది.
ఈ ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చింది అందాల భామ సమంత. "దిండు.. చై మొదటి భార్య. ఒకవేళ నేను అతడ్ని ముద్దుపెట్టుకున్నా, మా ఇద్దరి మధ్య అడ్డంగా ఉండేదదే" అని సమాధానం ఇచ్చింది.
బాధ వెనుక కారణమేంటి..?
ఎప్పుడూ రొమాంటిక్ స్టిల్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేసే సమంత... ఇటీవల ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేసింది. " ఇలా ఎందుకు ఉన్నానని అడగకండి" అని సందేశం పెట్టింది. తాజాగా మరో ఫొటోను అభిమానులతో పంచుకొని ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యను జోడించింది.
"జీవితంలోని తీవ్ర గాయాల్ని అప్పుడప్పుడూ పరిశీలించుకుంటేనే.. నీ అంతట నిన్ను గుర్తించుకోగలుగుతావు. అప్పుడే మనశ్శాంతి ఉంటుంది". --సమంత, సినీ నటి
ఈ కామెంట్లోని తీవ్రతను, ఫొటోలో కనిపిస్తున్న సామ్ లుక్‌ను చూస్తుంటే... ఆమె జీవితంలో ఏదో పెద్ద గాయాన్నే ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఎన్నో ప్రశంసలు, విమర్శలు ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ... ప్రస్తుతం దక్షిణాది టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది.
ఇటీవలే 'ఓ బేబీ' చిత్రంతో హిట్‌ను ఖాతాలో వేసుకున్న సమంత... ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ రూపొందిస్తోన్న ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది.