ETV Bharat / sitara

'శాస్త్రవేత్తను అవ్వాలనుకున్నా.. హీరోయిన్​ అయ్యా' - Renu Desai first cameo

సినీ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్​ సినిమాల్లోకి ఎలా వచ్చారో సామాజిక మాధ్యమాల వేదికగా చెప్పారు. శాస్త్రవేత్త అవ్వాలనుకున్న ఆమె ఎలా ముఖానికి రంగేసుకున్నారు.? అనేది అభిమానులతో పంచుకున్నారు. సెప్టెంబర్​ 9న ఆమె తొలిసారి కెమేరా ముందుకొచ్చినట్లు చెప్తూ.. అలనాటి కొన్ని ఫొటోలను షేర్​ చేశారు.

renu desai latest news
'శాస్త్రవేత్తను అవ్వాలనుకున్నా.. హీరోయిన్​ అయ్యా'
author img

By

Published : Sep 10, 2020, 5:30 AM IST

ఏదో అవ్వాలనుకొని అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన కథానాయకులెంతమందో. ప్రముఖ నటి రేణూ దేశాయ్‌ కూడా తాను కలలు కన్న ప్రపంచం విడిచి.. రంగుల లోకంలోకి అలాగే అడుగుపెట్టారు. శాస్త్రవేత్త, న్యూరోసర్జన్‌ కావాలనేది రేణూ చిన్నప్పటి లక్ష్యం. కానీ పలు కారణాల వల్ల ఆమె తన 16వ ఏటనే నటించడం మొదలుపెట్టారు.

1995 సెప్టెంబరు 9న తొలిసారి కెమెరా ముందుకొచ్చారు రేణూ దేశాయ్‌. పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా.. బుధవారం తన మనసులో మాట అభిమానులతో పంచుకున్నారామె.

"నాసాలో శాస్త్రవేత్త‌ అవ్వాలనుకున్న లక్ష్యం వదులుకొని పదహారేళ్లకే ఇటువైపు అడుగులు వేశాను. చాలా కాలం బాధపడ్డాను. షూటింగ్స్‌ ఆ బాధని పోగొట్టాయి. ఫిల్మ్‌ మేకింగ్‌ని ఇష్టపడ్డాను. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. మీ మనసుని నమ్మండి, నిజాయతీగా కష్టపడి పనిచేయండి. కచ్చితంగా విజయం సాధిస్తారు"

-- రేణూ దేశాయ్​, సినీ నటి.

ఓ వాణిజ్య ప్రకటన కోసం షూట్‌ చేసిన.. అలనాటి కొన్ని చిత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు రేణు. 'బద్రి' చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన రేణూ.. ప్రస్తుతం దర్శకురాలిగా మారారు.

రీఎంట్రీ పక్కా..?

సూపర్ స్టార్ మహేశ్​ బాబు నిర్మాతగా అడివి శేష్ హీరోగా 'మేజర్'​ అనే చిత్రం తెరకెక్కుతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త చిత్రసీమలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రేణు దేశాయ్​ను తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే మహేశ్ ఆ పాత్రకు ఆవిడయితేనే బాగుంటుందని ఆఫర్​ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందట.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.