ETV Bharat / sitara

అందుకే 'సూపర్​ ఉమన్​'గా మారా: రష్మిక - సూపర్​ ఉమన్​గా మారిన రష్మిక

చీరలో ఉన్న అందం, సౌకర్యం.. ఆధునిక దుస్తుల్లో ఉండదంటోంది హీరోయిన్​ రష్మిక. లాక్​డౌన్​ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ అందాల భామ సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో దగ్గరగా ఉంటోంది. వారు అడిగిన ప్రశ్నలకు తీరిగ్గా సమాధానాలు చెప్తోంది.

Actress Rashmika Mandhana about saree
అందుకే 'సూపర్​ ఉమన్​'గా మారాను: రష్మిక
author img

By

Published : May 17, 2020, 9:32 AM IST

ఇంట్లో ఎక్కువ సమయం గడిపింది తన జీవితంలోనే ఇది తొలిసారి అంటోంది రష్మిక. చిత్రీకరణలతో బిజీ బిజీగా గడిపే ఈమె, ప్రస్తుతం ఇంట్లో కుటుంబంతో కాలక్షేపం చేస్తోంది. అందం, అల్లరి, సంప్రదాయం... ఇలా అన్నీ కలబోసినట్టు కనిపించే రష్మిక ఈ ఏడాది ఆరంభంలోనే 'సరిలేరు నీకెవ్వరు'తో విజయాన్ని సొంతం చేసుకుంది. అవకాశాల పరంగా జోరు మీదున్న ఈ హీరోయిన్ ఎప్పుడెప్పుడు సెట్‌కి వచ్చేద్దామా అని ఎదురు చూస్తోందట. శనివారం అభిమానులతో ట్విట్టర్​‌లో పలు ముచ్చట్లు చెప్పింది.

Actress Rashmika Mandhana about saree
రష్మిక

'సూపర్​ ఉమన్'​గా మారా..

ఆధునిక దుస్తులతో పోలిస్తే అందం, సౌకర్యం అంతా చీరలోనే ఉందని చెప్పింది రష్మిక. ఇంట్లో పడుకున్న అమ్మానాన్నల్ని లేపడం ఇష్టం లేక, ఇంటి టెర్రస్‌ని ఎక్కేందుకు 'సూపర్‌ ఉమన్‌' అవతారం ఎత్తానని చిన్ననాటి జ్ఞాపకాల్ని పంచుకుంది. "నా జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ అంచనాలు పెద్దఎత్తున ఉంటాయి. ప్రస్తుతం నా అడుగులు సరైన దిశలో పడుతున్నాయి. నేను అనుకున్న చోటుకి చేరతానని నాకు తెలుసు" అని చెప్పింది రష్మిక.

ఇదీ చూడండి.. సినిమాకు సవాల్​: బార్​ థియేటర్లు రాబోతున్నాయా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.