హీరోయిన్ రష్మిక.. గ్రీన్ఇండియా ఛాలెంజ్లో పాల్గొంది. హీరోయిన్ సమంత విసిరిన సవాలును స్వీకరించి మొక్కలు నాటింది. అందుకు సంబంధించిన ఫొటోను ఇన్స్టాలో పంచుకుంది. సహచర కథానాయికలు కల్యాణి ప్రియదర్శన్, రాశీఖన్నాలకు ఛాలెంజ్ విసిరింది. దీనితోపాటే అభిమానులు, యువత కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కోరింది.
ప్రస్తుతం రష్మిక.. తెలుగు అల్లు అర్జున్ 'పుష్ప'లో హీరోయిన్గా నటిస్తోంది. దీంతో పాటే పొగరు(కన్నడ), సుల్తాన్(తమిళం) సినిమాల్లోనూ ప్రధాన పాత్రలు పోషిస్తోంది.