ETV Bharat / sitara

లాక్​డౌన్​లో హీరోయిన్​ రకుల్​ప్రీత్​ షార్ట్​ఫిల్మ్​ - రకుల్​ప్రీత్​ సింగ్​ లేటెస్ట్​ అప్​డేట్​

లాక్​డౌన్​ కారణంగా సినీప్రముఖులంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో తాను చేసే దినచర్యపై ఓ షార్ట్​ఫిల్మ్​ రూపొందించింది హీరోయిన్​ రకుల్​ ప్రీత్​సింగ్​. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్​గా మారింది.

Actress Rakul Preet REPEAT Short Film
లాక్​డౌన్​లో హీరోయిన్​ రకుల్​ప్రీత్​ షార్ట్​ఫిల్మ్​
author img

By

Published : Apr 26, 2020, 5:52 AM IST

ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటూ బోర్‌ కొడుతుంది. ఇలాంటి విషయాన్నే ఓ షార్ట్‌ ఫిల్మ్‌గా తీస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే పని చేసింది అందాల భామ రకుల్‌ ప్రీత్‌సింగ్‌.

ఇంతకీ వీడియోలో రకుల్‌ ఏమీ చేస్తుందంటే.. "నిద్ర లేచి..ఓ కప్పు కాఫీ తాగి, తరువాత ఫిట్‌నెస్‌ కోసం యోగాసానాలు వేస్తుంది. బ్రెడ్‌పై జామ్‌ రాస్తుంది. తరువాత పుస్తకాలు తిరగేస్తుంది. సన్నిహితులతో వీడియో కాల్‌ చేస్తుంది. ఆ తరువాత టీవీ చూస్తుంది. అంతలోనే ఆవలింపులు వస్తాయి..దాంతో రిమోట్‌తో టీవీని ఆపేస్తుంది" మొత్తం మీద ఇలా సాగిందంటూ ఆ వీడియోలో రకుల్‌ప్రీత్‌ తన రోజువారి సంగతులను చెప్పింది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్​గా మారింది.

రకుల్‌ ప్రీత్‌సింగ్‌ గతేడాది నాగార్జునతో కలిసి 'మన్మథుడు 2'లో సందడి చేసింది. హిందీలో 'దే దే ప్యార్‌ దే', 'సిమ్లా మిర్చి' లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ నటిస్తున్న 'ఇండియన్‌2'లో చేస్తోంది రకుల్​.

ఇదీ చూడండి.. 'దీపికతో విడిపోవడం నా వ్యక్తిగత విషయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.