తాను బికినీ ధరించాలనే ఆలోచన తన అమ్మనాన్నలదని చెబుతోంది ముద్దుగుమ్మ రకుల్‌ప్రీత్ సింగ్. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించింది.
"మా అమ్మ నన్ను 'మిస్ ఇండియా' పోటీల్లో పాల్గొనాలని కోరుకుంది. నేను మాత్రం అక్కడ చాలా తతంగం ఉంటుందని ఆమెతో చెప్పా. అక్కడ అందరూ బికినీలు ధరించాల్సి ఉంటుంది. నాకు అది వేసుకోవడం ఇష్టం లేదని చెప్పాను. అయినా అమ్మ మాత్రం వెనుకడుగు వేయకు ఏమైతే అది అవుతుంది, నువ్వు తప్పక పోటీకి వెళ్లాల్సిందే అని పట్టుబట్టింది. మా నాన్న.. బికినీ విషయంలో ధైర్యం చెప్పారు. తల్లిదండ్రులు ఎవరైనా సరే ఇలాంటి విషయాల్లో జంకుతారు. కానీ మా అమ్మనాన్న మాత్రం నాకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించారు. ఇప్పుడిలా నటిగా మారానంటే ఇదంతా వారి చలవే" -రకుల్ ప్రీత్ సింగ్, నటి
హిందీతో పాటు దక్షిణాదిలోనూ కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది రకుల్. గతేడాది ఆరు సినిమాల్లో నటించింది. ఈ ఏడాది అదే జోరు కొనసాగిస్తోంది. ప్రస్తుతం 'భారతీయుడు 2'లో ఓ హీరోయిన్గా నటిస్తోంది.