ETV Bharat / sitara

23 ఏళ్ల కెరీర్​లో అస్సలు సెలవు పెట్టని నటి ఈమె! - movie news

నెలవంక సైతం అసూయపడే అందం తనది. అలా చూస్తూ ఉండాలనే తపన అభిమానులది. ఆ ముఖం చూసి జాబిలే మబ్బు చాటుకు జారిపోతుంది. ఆ కన్నుల వెలుగును చూసి చుక్కలే సిగ్గుతో మాయమైపోతాయి. ఆ బుగ్గమీద పుట్టుమచ్చ నిండుచంద్రుడిలో మచ్చను గుర్తుచేస్తుంది. అందం, అభినయ మిశ్రమంతో విశ్రమించని బ్రహ్మ పరిశ్రమించి సృజించిన అప్సరస ఆమె. అసలు పేరు కుసుమ కుమారి. తెరపై మహా సుకుమారి. జానపదాల్లో రాకుమారి. ఆ వయ్యారి అభినయిస్తే ఓ నాట్యమయూరి. తన రాకతో తెలుగుతెరకు అందాలు అద్దారు. పోతపోసిన సౌందర్యరాశి ఆ స్త్రీ. ఆమె రాజశ్రీ..

actress rajshree
రాజశ్రీ
author img

By

Published : Aug 8, 2021, 9:30 AM IST

ఎన్నో హృదయాల్లో నిదురించిన చెలి. ఎందరో కలలలో కవ్వించిన సఖి. బాలనటిగా ప్రవేశించి అందాల భామగా సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన రాజశ్రీ ఆరోజుల్లో ఎంతో పాపులర్. ఆమె అభినయం అమోఘం. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో దాదాపు 300 పైగా సినిమాల్లో నటించిన గొప్ప నటి. ఒక్కరోజు కూడా షూటింగ్​కు సెలవు పెట్టని మేటి నటి ఆమె అని చెబుతారు. ఆనాటినుంచి ఈనాటి వరకూ రాజశ్రీని మించిన అందమైన డాన్సర్ లేదని సినిమా వర్గాలు చెప్పుకుంటాయి. నృత్యం అంటే పిచ్చి ప్రేమ. అదే ఆమెకు సినిమా అవకాశాలను మోసుకొచ్చింది. చిన్నప్పుడు స్కూల్లో డ్రామా వేస్తే కృష్ణుడిగా, మేనకగా ద్విపాత్రాభినయం చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అది 1956వ సంవత్సరం. ఆరోజు తన జీవితాన్ని మలుపుతిప్పే రోజు అని తెలియదు. చెన్నైలో ఉంటున్న రాజశ్రీ ఇంటికి వాళ్ల ఊరి నుంచి బంధువులొస్తే ఏవీఎం స్టూడియోలో సినిమా షూటింగ్‌ చూడటం కోసం వెళ్లారు. అపుడు తన వయసు పదేళ్లు. తలబిరుసు పాత్రలకు తలకట్టు లాంటి అగ్రనటి జమున అక్కడ కూర్చుని ఉన్నారు. పక‌్కనే సెలక్షన్స్‌ జరుగుతున్నాయి. దండాయుధపాణి అనే డ్యాన్స్‌ మాస్టర్, దర్శకుడు చెట్టియార్‌ కూర్చుని పిల్లల చేత డ్యాన్స్‌ చేయిస్తూ సెలెక్షన్స్‌ చేస్తున్నారు. సెలక్షన్స్‌ కోసం అని అక్కడికి రాకపోయినా ఊరికే స్టూడియో చూట్టానికి వచ్చిన రాజశ్రీని నటి జమున గమనించి ఈ పిల్ల బాగుంటుంది అని అక్కడ స్టాఫ్‌కు చూపించారు. అంతే అలా సెట్‌లోకి తొలిసారి అడుగు పెట్టారు. శివాలయం సెట్‌లో శివలింగం ముందు డ్యాన్స్‌ చేయడం రాజశ్రీ తొలి పాత్ర. ఆ సినిమా పేరు 'నాగదేవతై'. మొదట ఇంట్లో ఆమె తల్లి ఒప్పుకోకపోయినా "కేవలం 'చిన్న బిట్‌.. శివుడి దగ్గర డ్యాన్స్‌' అని చెబితే ఒప్పుకొన్నారు. ఆ తర్వాత పర్మినెంట్‌ ఆర్టిస్ట్‌గా బుక్‌ చేశారు. అలా ఏవీఎం సంస్థ మూడేళ్లు అగ్రిమెంట్‌ తీసుకుని ఆమెకు అవకాశం కల్పించారు. అప్పట్లో ఏవీఎం సంస్థలో అవకాశం రావటం గొప్పగా చెప్పుకునేవారు.

నాగుల చవితి తర్వాత భక్త అంబరీష, మాంగల్యం తదితర చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా రాణించారు. 1960లో విడుదలైన నిత్య కళ్యాణం పచ్చ తోరణం సమాజంలో ఉన్న కులవ్యవస్థపై సంధించిన సందేశాత్మక చిత్రం. ఈ సినిమా ద్వారా రామకృష్ణ నటుడిగా పరిచయమయ్యారు. ఆయన సరసన హీరోయిన్‌గా షీలా పాత్రలో రాజశ్రీ నటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎల్వీ ప్రసాద్.. తన ప్రసాద్ ప్రొడక్షన్స్ బేనర్‌పై నిర్మించారు. ఇదే చిత్రాన్ని 'దాదీమా'గా హిందీలో నిర్మించారు. అలనాటి బాలీవుడ్ దిగ్గజాలు అశోక్‌కుమార్, బీనారాయ్, రెహమాన్, తనూజ నటీనటులుగా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. నిజం చెప్పాలంటే 1962 రాజశ్రీకి ఎంతో అచ్చొచ్చిన సంవత్సరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఏడాదే.. భార్య అనే మళయాళ మూవీతో హీరోయిన్​గా మెరిశారు. ఆ సినిమాలో ఆమె పేరు గ్రేసీ కావడం, అది హిట్ అవ్వడం వల్ల మళయాళ ప్రేక్షకులకు గ్రేసీగానే రాజశ్రీ గుర్తుండిపోయారు.

కానిస్టేబుల్ కూతురు మూవీతో తెలుగులో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇదే 1962లో రాజశ్రీకి తన అభిమాన నటుడు, విశ్వవిఖ్యాతుడు ఎన్టీఆర్ సినిమాలో తొలిసారి నటించే అవకాశం రావటంతో ఆనందానికి అవధుల్లేవు. ఎన్టీఆర్ శివుడు పాత్రలో కైలాసంలో ప్రళయ తాండవం చేసినప్పుడు ఆయనను తొలిసారి చూసిన దృశ్యం ఇంకా మరిచిపోలేను అని, శివుడు వచ్చి నాట్యం చేస్తున్న భావన కలిగిందని రాజశ్రీ అందరితో అనేవారు.

ప్రపంచంలో అత్యధికంగా జానపద చిత్రాల్లో కథానాయకునిగా నటించిన ఘనత ఎన్టీఆర్‌దే. చిన్నప్పటి నుంచి చందమామ కథలు చదువుతూ జానపద చిత్రాలను అమితంగా ఇష్టపడిన రాజశ్రీ అనుకోకుండా నటిగా మారి అనేక జానపదాల్లో ప్రేక్షకులను మురిపించారు. అదే 1962లో అదృష్టం ఆరాధన సినిమా రూపంలో అక్కినేని సరసన నటించే అవకాశానికి తలుపులు తీసింది. వి ఫర్ విక్టరీగా పిలుచుకునే వి.మధుసూదనరావు దర్శకత్వంలో వి.బి. రాజేంద్రప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం బెంగాలీ నవల సాగరిక ఆధారంగా రూపొందింది. సాలూరి రాజేశ్వరరావు స్వరకల్పన చేసిన "నా హృదయంలో నిదురించే చెలీ కలలోనే కవ్వించే సఖీ" పాట తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆల్‌టైమ్‌ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. శ్రీశ్రీ రాసిన ఈ పాటకు ఘంటశాల గాత్రం అందించారు. ఏఎన్‌ఆర్‌ సంగీత వాయిద్యాన్ని మీటుతూ పాడుతుంటే ఆకాశం నుంచి అందాల తార ఒకటి నెమ్మదిగా కిందకి జారుతున్నట్టు మేడపై నుంచి ఒక్కో మెట్టు దిగుతూ రాజశ్రీ కేవలం అభినయంతోనే ఆకట్టుకుంది.

1964లో రాజశ్రీ అగ్గిపిడుగులో నటించారు. విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా సూపర్‌హిట్ కావడం వల్ల రాజశ్రీకి రాజయోగం పట్టింది. అప్పట్లో జానపద చిత్రాలు ఎక్కువగా రావడం, అందులో రాజశ్రీ కీలక పాత్రలు కావటం వల్ల ఆమె కొన్ని తరాలకు అలా గుర్తుండిపోయారు. ముఖ్యంగా కాంతారావు సరసన ఆమె చేసిన పాత్రలు ప్రేక్షకుల మదిలో సజీవంగా ఉన్నాయి. అగ్గి బరాటా, చిట్టిచెల్లెలు, పిడుగు రాముడు వంటి చిత్రాలతో ఎన్టీఆర్ తో రాజశ్రీ నటించి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. కాంతారావు, శోభన్ బాబు వంటి వారితో నటించి టాప్ హీరోయిన్స్​లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.

పక్కలో బల్లెం, బంగారు తిమ్మరాజు, ప్రతిజ్ఞా పాలన, జయసింహ, అగ్గిదొర, భూలోకం యమలోకం, మెరుపు వీరుడు, అగ్గిమీద గుగ్గిలం వంటి చిత్రాలు ప్రేక్షకులను రంజింపచేశాయి. అప్పటికే దండాయుధపాణి పిళ్లై మాస్టర్‌గారి వద్ద నాట్యాన్ని అభ్యసించిన రాజశ్రీ పనిలో పనిగా అక్కడే హిందీ, ఉర్దూ కూడా నేర్చుకున్నారు. దాంతో ఆమెకు ఐదు భాషల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఆరోజుల్లో కృష్ణకుమారి టాప్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాల్లో రాజశ్రీ సెకండ్‌ హీరోయిన్‌గా చేసేవారు. ఆ తర్వాత కృష్ణకుమారికి వివాహం కావడం వల్ల ప్రధాన హీరోయిన్‌గా రాజశ్రీకి అవకాశాలు వెల్లువెత్తాయి.

1965లో హీరోయిన్‌గా తొలిసారి ‘కాదళిక్కి నేరమిల్లే" అనే తమిళ సినిమాలో నటించారు. అదే తెలుగులో ‘ప్రేమించి చూడు’ పేరుతో అక్కినేనితో తీశారు. హిందీలో ‘ప్యార్‌కియే జా"గా శశికపూర్‌తో తీశారు. మూడు భాషల్లోనూ రాజశ్రీనే హీరోయిన్‌గా నటించాలని దర్శక నిర్మాతలు కోరుకున్నారంటే ఆమెకు ఎంత డిమాండో అర్థం చేసుకోవచ్చు.

డిమాండ్‌ ఎంత ఉన్నా పారితోషికం విషయంలో ఎప్పుడూ పేచీ పెట్టని తీరు ఇండస్ట్రీలో రాజశ్రీ అవకాశాలను విస్తృతం చేసింది. స్టార్‌ అయినా సర్ అనే అంటుంది. రూ.1600 పారితోషికానికి కూడా నటించటానికి ఒప్పుకొంది కాబట్టి ఆమెనే తన చిత్రాల్లో ఎక్కువ అవకాశాలు ఇచ్చానని దర్శక దిగ్గజం విఠలాచార్య చెప్పేవారు.

దక్షిణాది చిత్రపరిశ్రమలో 1956 నుంచి 1979 వరకు రాజశ్రీ నటిగా రాణించారు. టాప్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కాంతారావు, శోభన్‌బాబు, రాజ్‌కుమార్‌, శశికపూర్ వంటి వారితో కలిసి పనిచేశారు. బాక్సాఫీసు వద్ద అఖండ విజయాలు సాధించారు. తెలుగులో 76 సినిమాలలో నటించిన రాజశ్రీ.. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లోనూ కథానాయికగా మెప్పించి, గుర్తింపు పొందారు. ప్రతి పాత్రలో లీనమై పనిచేసేవారు. దేవతా పాత్రల్లో నటించేటప్పుడు మాంసాహారం కూడా ముట్టకుండా నిష్టగా పనిచేసేవారు. అందుకే ఆమె ఎప్పటికీ వెండితెర వేల్పుగా నిలిచిపోతారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.