ETV Bharat / sitara

జైల్లోనే సంజన, రాగిణి.. బెయిల్​పై విచారణ వాయిదా - kannada news updates

శాండిల్​వుడ్​ డ్రగ్స్​ కేసులో అరెస్టయిన నటి రాగిణి, సంజనల బెయిల్​ అభ్యర్థనను ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. సెప్టెంబరు 21న తిరిగి విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో వీరిద్దరూ మరో రెండు రోజులు కారాగారంలోనే గడపాల్సి ఉంటుంది.

Ragini, Sanjana
రాగిణి, సంజన
author img

By

Published : Sep 19, 2020, 2:21 PM IST

Updated : Sep 19, 2020, 2:44 PM IST

కన్నడ చిత్రసీమ డ్రగ్స్​ వ్యవహారంలో ఆసక్తికర మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇటీవలే అరెస్టయిన నటి రాగిణి ద్వివేది, సంజనా గల్రానీల బెయిల్​ అభ్యర్థనను శనివారం ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. ఇద్దరికీ బెయిల్​ ఇవ్వడంపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే విచారణ ఈ నెల 21(సోమవారం)కి వాయిదా వేసింది. దీంతో వీరిద్దరూ మరో రెండు రోజులు జైలులోనే గడపాల్సి ఉంటుంది.

శాండిల్​వుడ్​ డ్రగ్​ రాకెట్​తో సంబంధమున్న ఆరోపణలపై రాగిణి, సంజనలతో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రేవ్​ పార్టీల్లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు వీరిపై అభియోగాలు మోపారు.

Last Updated : Sep 19, 2020, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.