ETV Bharat / sitara

'ఇన్​స్టా హ్యాక్​ అయింది.. ఆ సందేశాలు నేను పెట్టలేదు' - Actress Pooja Hegde Instagram hacked news

ప్రముఖ నటి పూజాహెగ్డేకు కొత్తగా ఓ చిక్కెదురైంది. తన ఇన్​స్టా అకౌంట్​ను ఎవరో హ్యాక్​ చేసినట్లు చెప్పింది. అయితే గంటపాటు కష్టబడి తన సాంకేతిక బృందం అకౌంట్​ను పునరుద్ధరించినట్లు చెప్పింది. తన నుంచి వ్యక్తిగతంగా ఏవైనా సందేశాలు వస్తే నమ్మకండని స్పష్టం చేసింది.

Pooja Hegde Instagram account hacked
'నా ఇన్​స్టా హ్యాక్​ అయింది.. ఆ పోస్టులు నేను పెట్టలేదు'
author img

By

Published : May 28, 2020, 12:07 PM IST

Updated : May 28, 2020, 12:57 PM IST

స్టార్‌ హీరోయిన్‌ పూజాహెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్‌కు గురయ్యింది. తన టెక్నికల్‌ టీం గంటపాటు శ్రమించి మరలా ఆ అకౌంట్‌ను పునరుద్ధరించారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

అర్ధరాత్రి సందేశం...

"హాయ్‌ ఆల్‌!! ఇన్‌స్టా అకౌంట్‌ హ్యాక్‌కు గురయ్యిందని ఇప్పుడే నా టీం సమాచారమిచ్చింది. ప్రస్తుతం మేము దానిని పునరుద్ధరించే పనిలో ఉన్నాం. కాబట్టి నా అకౌంట్‌ నుంచి వ్యక్తిగతంగా ఎవరికైనా మెస్సేజ్‌లు వస్తే వాటిని నమ్మకండి. అలాగే మీ వ్యక్తిగత సమాచారం చెప్పమని అడిగితే మీరూ చెప్పకండి. ధన్యవాదాలు" అని పూజాహెగ్డే అర్ధరాత్రి 12.37 గంటలకు ట్విట్టర్​ వేదికగా నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. అనంతరం తన డిజిటల్‌ టీం అకౌంట్‌ పునరుద్ధరించారని పేర్కొంటూ అర్ధరాత్రి 1.05 గంటలకు ట్విట్టర్​, ఇన్​స్టా వేదికగా వెల్లడించారు.

"హ్యాక్‌కు గురైన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ని పునరుద్ధరించడం కోసం గంటపాటు శ్రమించాం. ఇలాంటి సమయంలో ఎంతో కష్టపడి పనిచేసిన నా టెక్నికల్‌ టీంకు ధన్యవాదాలు. చివరికి నా అకౌంట్‌ నా చేతుల్లోకి వచ్చింది. గంట క్రితం నా అకౌంట్​ నుంచి వచ్చిన పోస్టులను, మెస్సేజ్‌లను తొలగించాం" అని పూజా వివరించారు.

Pooja Hegde Instagram account hacked a
అకౌంట్​ పునరుద్ధరించాక పూజా హెగ్డే పోస్టు

'అల.. వైకుంఠపురములో..' చిత్రంతో ఈ ఏడాది ఆరంభంలోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు పూజా. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో నటిస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. వింటేజ్‌ ప్రేమకథాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు.. 'జాన్‌' అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది.

ఇదీ చూడండి: ఆ స్టార్​హీరో కంటే పూజా హెగ్డేకే ఎక్కువ రెమ్యునరేషన్!

Last Updated : May 28, 2020, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.