ETV Bharat / sitara

పిజ్జాబాయ్​ నిర్వాకం.. అశ్లీల గ్రూపుల్లో నటి నంబర్​! - cinema news latest

పిజ్జా డెలివరీ బాయ్‌ చేసిన నిర్వాకంతో ఓ నటి ఇబ్బందులకు గురయ్యింది. దీంతో సదరు నటి పోలీసులను ఆశ్రయించింది. అసలేం జరిగిందంటే.

Actress phone number in adult groups .. pizza boy cause
అస్లీల గ్రూపుల్లో నటి ఫోన్​ నెంబరు.. పిజ్జా బాయే కారణం
author img

By

Published : Feb 28, 2020, 2:43 PM IST

Updated : Mar 2, 2020, 8:53 PM IST

మణిరత్నం తెరకెక్కించిన 'అంజలి' సినిమాతో బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యింది గాయత్రి సాయి. ఆ తర్వాత ఆమె పలు తమిళ చిత్రాల్లో నటించింది. తాజాగా ఆమె ఫోన్‌ నంబర్‌ను ఓ పిజ్జా డెలివరీ బాయ్ పలు అశ్లీల గ్రూప్‌ల్లో షేర్‌ చేశాడు. దీంతో ఆమెకు పలువురి నుంచి అసభ్యకరమైన సందేశాలు వచ్చాయి. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్‌ నంబర్‌ను షేర్‌ చేయకుండా ఉండేలా ఆన్‌లైన్‌ యాప్స్‌ తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్​ వేదికగా సదరు డెలివరీ బాయ్‌ ఫొటోను పోస్ట్‌ చేస్తూ ట్వీట్​ చేసింది.

Actress phone number in adult groups .. pizza boy cause
పిజ్జా బాయ్​

"ఈ నెల 9న పిజ్జా డెలివరీ కోసం ఓ వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత అతను నా ఫోన్‌ నంబర్‌ను పలు అశ్లీల గ్రూపుల్లో షేర్‌ చేశాడు. అప్పటినుంచి పలువురి నుంచి అసభ్యకరమైన సందేశాలు, ఫోన్‌కాల్స్‌ నాకు వస్తున్నాయి. దీని గురించి నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి."

గాయత్రి సాయి, నటి

అంతేకాకుండా తనకి వచ్చిన చాట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ను షేర్‌ చేసి ఆమె తమిళనాడు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ను ట్యాగ్‌ చేస్తూ.. "ఈ విధంగా అతను నా ఫోన్‌ నంబర్‌ను షేర్‌ చేశాడు. దయచేసి నాకు సాయం చేయండి" అని ట్వీట్‌ చేసింది. తగిన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్‌ చెప్పినట్లు గాయత్రి వెల్లడించింది.

Last Updated : Mar 2, 2020, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.