ETV Bharat / sitara

మొక్కలు నాటిన మోనాల్​ గజ్జర్.. మరికొందరికి గ్రీన్​ 'ఛాలెంజ్​'​ - గ్రీన్​ ఛాలెంజ్​లో పాల్గొన్న నటి మోనాల్​ గజ్జర్​ వార్తలు

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్​కుమార్​ శ్రీకారం చుట్టిన గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఎందరో ప్రముఖులు ఈ ఛాలెంజ్​లో పాల్గొని తమ వంతుగా మొక్కలు నాటారు. తాజాగా టాలీవుడ్​ కథానాయిక మోనాల్​ గజ్జర్​ ఈ ఛాలెంజ్​లో భాగమయ్యారు. జూబ్లీహిల్స్​లోని పార్కులో మొక్కలు నాటారు. మరికొందరికి ఈ సవాల్​ విసిరారు.

Actress Monal gajjar participated in green india challenge
మొక్కలు నాటిన మోనాల్​ గజ్జర్.. మరికొందరికి గ్రీన్​ 'ఛాలెంజ్​'​
author img

By

Published : Jan 25, 2021, 6:01 PM IST

అడవులు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఎంపీ సంతోష్​​​కుమార్‌ చేస్తున్న అద్భుతమైన ఉద్యమం గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ అని సినీ కథానాయిక మోనాల్‌ గజ్జర్‌ పేర్కొన్నారు. దేత్తడి హారిక విసిరిన గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​ను ఆమె స్వీకరించారు. జూబ్లీహిల్స్‌లోని పార్కులో మొక్కలు నాటారు. మొక్కల పక్కన కూర్చొని స్వీయ చిత్రాలు దిగారు.

ఈ సందర్భంగా ఆనంద్, మిత్ర గాద్వి, కృష్ణకుల్​ శేఖరన్​​, మల్హాత్​ థాకర్​లు గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొని మొక్కలు నాటాలని సవాల్​ విసిరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.