ETV Bharat / sitara

పరిచయమైన ఆరురోజులకే పెళ్లి ప్రతిపాదన: మెహరీన్ - మూవీ లేటేస్ట్ న్యూస్

తనకు కాబోయే భర్త భవ్య భిష్ణోయ్​ గురించి ఆసక్తికర విషయాల్ని పంచుకుంది నటి మెహరీన్. పరిచయమైన ఆరో రోజే పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడని తెలిపింది.

actress mehreen about her fiance bhavya bishnoi
పరిచయమైన ఆరురోజులకే పెళ్లిప్రతిపాదన: మెహరీన్
author img

By

Published : Mar 20, 2021, 3:08 PM IST

'కృష్ణగాడి వీరప్రేమగాథ'లో మహాలక్ష్మిగా మెప్పించి.. 'ఎఫ్‌ 2'లో హనీగా అలరించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహరీన్‌. ఇటీవల ఈమె నిశ్చితార్థం భవ్య బిష్ణోయ్‌తో వేడుకగా జరిగింది. ఈ నేపథ్యంలో తన జీవిత భాగస్వామి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. కాబోయే శ్రీవారు పరిచయమై కేవలం పది నెలలే అయినప్పటికీ జీవితకాలం అతనితో అనుబంధం ఉన్నట్లు అనిపిస్తుందని తెలిపారు.

mehreen  bhavya bishnoi
భవ్య బిష్ణోయ్​తో మెహరీన్

"మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. గతేడాది లాక్‌డౌన్‌లోనే మాకు పరిచయమైంది. లాక్‌డౌన్‌ వల్ల మేమిద్దరం కలవలేకపోయాం. కానీ, పరిచయమైన నాటి నుంచి ప్రతిరోజూ మెస్సేజ్‌లు, ఫోన్లు చేసుకునేవాళ్లం. ఇద్దరి అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలనూ పంచుకున్నాం. మేమిద్దరం మాట్లాడుకోవడం ప్రారంభించిన ఆరు రోజులకే తను నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఆయన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కోసం గత నెల అండమాన్‌ వెళ్లాం. స్కూబా డైవింగ్‌ చేస్తున్న సమయంలో 'విల్‌ యూ మ్యారీ మీ' కార్డుతో భవ్య నన్ను సర్‌ప్రైజ్ చేశాడు. నేను కూడా ఓకే చెప్పాను"

"నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ప్రతి విషయాన్ని మేమిద్దరమే దగ్గరుండి చూసుకున్నాం. ఎందుకంటే ఇది మా జీవితాల్లో ఎంతో ముఖ్యమైన వేడుక. నిశ్చితార్థం ఎక్కడ జరగాలి? ఎలాంటి ఫుడ్‌ అతిథులకు అందించాలి? బహుమతులు ఎలా ఉండాలి? డెకరేషన్స్‌... ఇలా ప్రతి చిన్న విషయాన్ని మేమిద్దరం ఎంతో ప్లాన్‌ చేసి సిద్ధం చేశాం. పెళ్లి డేట్‌ ఇంకా ఫిక్స్‌ కాలేదు. వింటర్‌ సీజన్‌లో వివాహం జరిగే అవకాశం ఉంది. మాది పక్కా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌. నేను ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను" అని మెహరీన్‌ చెప్పారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 'ఎఫ్‌ 3'లో నటిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.