ETV Bharat / sitara

మాస్ పాత్ర.. అల్లరి పిల్ల కీర్తి సురేశ్ - కీర్తి సురేశ్ తాజా వార్తలు

కీర్తిసురేశ్ 'గుడ్​లక్ సఖి' పోస్టర్ ఆకట్టుకుంటోంది. రేపు(ఆగస్టు 15) ఈ సినిమా టీజర్​ రానుంది. రొమాంటిక్ కామెడీ కథతో దీనిని రూపొందిస్తున్నారు.

మాస్ పాత్ర.. అల్లరి పిల్ల కీర్తి సురేశ్
కీర్తి సురేశ్
author img

By

Published : Aug 14, 2020, 7:01 AM IST

"వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు చేస్తుంటే సౌకర్యంగానే ఉంటుంది. కానీ, కొత్తగా మన ప్రతిభను చూపించేందుకు అవకాశమేం ఉంటుంది. ఆ పాత్రను తెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు కొత్త అనుభూతి దొరకొచ్చేమో కానీ, నటిగా నాకు సంతృప్తి దొరికేది నా వ్యక్తిత్వానికి భిన్నమైన పాత్రల్లో నటించినప్పుడే. నిజానికి వ్యక్తిగతంగా నేను సున్నితమే. కానీ, తెరపై అందుకు భిన్నంగా కనిపించడానికి ఇష్టపడుతుంటా. అలాంటి పాత్రలు చేస్తున్నప్పుడు ఓ కొత్త జీవితంలోకి తొంగి చూస్తున్న అనుభూతి కలుగుతుంటుంది. అందుకే నటిగా అన్ని రకాల పాత్రలూ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. వీటిలో నాకంటూ కొన్ని ఇష్టమైన పాత్రలూ ఉన్నాయి. నాలో మాస్‌ కోణం ఉంది. ఇప్పటి వరకు దాన్ని పూర్తిస్థాయిలో చూపించే అవకాశం రాలేదు. అల్లరి పిల్లగా నటించాలి. ఇలా కొన్ని ప్రత్యేకమైన పాత్రలున్నాయి" అని నటి కీర్తి సురేశ్ చెప్పింది.

ACTRESS KEERTHY SURESH GOOD LUCK SAKHI
'గుడ్​లక్ సఖి' సినిమాలో కీర్తి సురేశ్

ఆమె నటించిన 'గుడ్​లక్ సఖి' సినిమా ఫస్ట్​లుక్ ఆకట్టుకుంటోంది. ఆటన నేపథ్యంలో సాగే రొమాంటిక్ కామెడీగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న టీజర్​ విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. నాగేశ్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నారు. సుధీర్ చంద్ర పాదిరి నిర్మాత.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.