ETV Bharat / sitara

'ఆదిపురుష్'​లో ప్రభాస్​ సరసన కీర్తి సురేశ్​! - ఆదిపురుష్​ సినిమా అప్​డేట్స్​

డార్లింగ్​ ప్రభాస్, బాలీవుడ్​ దర్శకుడు ఓం రౌత్​ కాంబినేషన్​లో తెరకెక్కబోతున్న చిత్రం 'ఆదిపురుష్​'. ఈ చిత్రంలో ప్రభాస్​.. రాముడి పాత్రలో కనువిందు చేయనున్నాడని సమాచారం. కాగా సీత పాత్ర కోసం హీరోయిన్​ కీర్తి సురేశ్​ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Actress Keerthi Suresh to essay Sita's character in the upcoming Prabhas starrer Adipurush?
'ఆదిపురుష్'​లో ప్రభాస్​ సరసన కీర్తి సురేశ్​!
author img

By

Published : Aug 20, 2020, 10:17 AM IST

Updated : Aug 21, 2020, 8:17 AM IST

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్ కొత్త సినిమా 'ఆదిపురుష్'. భారతీయ ఇతిహాస కథతో దీన్ని రూపొందించనున్నారు. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇటీవలే విడుదలైన కాన్సెప్ట్​ పోస్టర్​ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో ప్రభాస్​.. రాముడి పాత్ర పోషించనున్నాడని దర్శకుడు నాగ్​ అశ్విన్​ చేసిన ట్వీట్​ ద్వారా తెలుస్తోంది. కాగా సీత పాత్ర కోసం స్టార్​ హీరోయిన్​ కీర్తి సురేశ్​ను చిత్రబృందం పరిశీలిస్తోందని బాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి.

'ఆదిపురుష్​'లో సీత పాత్ర కోసం కీర్తి సురేశ్​ను మాత్రమే ఎంపిక చేయాలని దర్శకుడు ఓం​ రౌత్​ యోచిస్తునట్లు సమాచారం. ఈ చిత్రంలోని నటీనటులతో పాటు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే చిత్రబృందం వెల్లడించనుంది. ప్రభాస్​ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్​ దర్శకత్వంలో 'రాధేశ్యామ్', నాగ్​ అశ్విన్​తో ఓ సైన్స్​ ఫిక్షన్​ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తయిన వెంటనే 'ఆదిపురుష్'​ పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమాను 3డీ ఎఫెక్ట్​లో తెరకెక్కించబోతుండటం విశేషం.

Last Updated : Aug 21, 2020, 8:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.