ETV Bharat / sitara

'తల్లిగా ఎలా ఉండాలో అమ్మని అడిగి తెలుసుకున్నా'

'మహానటి' చిత్రంలో అద్భుతమైన నటన కనబరచి.. సావిత్రినే తలపించేలా నటించింది కీర్తి సురేశ్​. తాజాగా థ్రిల్లర్​ నేపథ్యంలో తెరకెక్కిన 'పెంగ్విన్'​ సినిమాలో నటించింది. ఈ నెల 19న అమెజాన్​ ప్రైమ్​లో ప్రేక్షకుల మందుకు రానుంది చిత్రం. ఈ సందర్భంగా సినిమా విశేషాలతో పాటు, చిత్రీకరణ సమయంలో అనుభవాలను పంచుకుంది కీర్తి.

KEERTHI SURESH SPECIAL INTERVIEW
కీర్తి సురేష్​
author img

By

Published : Jun 16, 2020, 8:19 AM IST

'మహానటి'తో జాతీయ స్థాయిలో కీర్తి సంపాదించిన కథానాయిక కీర్తిసురేశ్​‌. సావిత్రి పాత్రలో ఒదిగిపోయి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఘనమైన ఆ విజయం తర్వాత అందుకు దీటైన కథలతో ప్రయాణం చేయాలనే తపనతో అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె నటించిన చిత్రం 'పెంగ్విన్‌'. వివిధ బాషల్లో రానున్న ఈ సినిమా.. జూన్​ 19న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడులయ్యేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా కీర్తి సినిమా విశేషాలతో పాటు, అనేక విషయాలపై తన అభిప్రాయాలు పంచుకుంది.

KEERTHI SURESH INTERVIEW
కీర్తి సురేష్​

పెద్ద తెరపై సినిమాని ఊహించుకుంటూ 'పెంగ్విన్‌'లో నటించారు. మరి ఓటీటీ వేదికపై విడుదలవుతుండడంపై మీ అభిప్రాయం?

'పెంగ్విన్‌' సినిమా థియేటర్లలోనే విడుదలవుతుందని ఊహించాను. ఒక సినిమాని థియేటర్‌లో చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు కదా. ఇలాంటి సమయంలోనూ నా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందనే సంతోషమే ఎక్కువగా ఉంది. ఓటీటీ వేదికపై నా సినిమా విడుదలవుతోందనేది అనూహ్యంగా, ఆశ్చర్యంగానే అనిపిస్తున్నప్పటికీ.. దీని వల్ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువవుతుంది సినిమా. థియేటర్ల ద్వారా సినిమాని ఎంత మంది చూస్తారో ఏమో కానీ, అంతకంటే ఎక్కువమందే ఓటీటీ ద్వారా చూసే అవకాశాలు ఉంటాయి. ఈ వేదికలతో కొత్త ప్రేక్షకులకూ చేరువవుతాం.

'మహానటి' తర్వాత మీ నుంచి వస్తున్న నాయికా ప్రధానమైన సినిమా ఇదే కదా?

'మహానటి' తర్వాత నేను ఒప్పుకొన్న కథ కూడా ఇదే. మధ్యలో నావి కొన్ని సినిమాలు విడుదలైనా అవి దానికి ముందు ఒప్పుకొన్నవే. ఆ సినిమా విడుదలయ్యాక ఆరు నెలలు విరామం తీసుకుని కథలపై దృష్టి పెట్టా. మంచి కథని ఎంచుకుని చేయడానికి ఇంత సమయం పట్టింది.

KEERTHI SURESH INTERVIEW
కీర్తి సురేష్​

'పెంగ్విన్‌' మీ తొలి థ్రిల్లర్‌ సినిమా. మీకు థ్రిల్లర్స్‌ ఇష్టమా?

ఒక ప్రేక్షకురాలిగా నేను అన్ని రకాల సినిమాల్నీ ఆస్వాదిస్తాను. నటిగా నేను చేసిన తొలి థ్రిల్లర్‌ చిత్రం ఇదే. దీన్ని ఎమోషనల్‌ థ్రిల్లర్‌ అనడమే కరెక్ట్‌. ఇందులో బలమైన భావోద్వేగాలు ఉంటాయి. థ్రిల్‌ అనేది కథలో ఒక ఉప అంశంలా ఉంటుంది. తల్లీబిడ్డల నేపథ్యంలో ఆసక్తికరంగా సాగుతుంది 'పెంగ్విన్‌'. నాలుగు రోజుల్లో జరిగే కథ ఇది.

యువ కథానాయికలు తల్లిగా నటించడానికి ఒప్పుకోరు కదా. మరి సినిమా ఒప్పుకున్నప్పుడు మీకు ఆ భయాలేమీ లేవా?

ఈ ప్రశ్నని ఇప్పుడందరూ అడుగుతుంటేనే తల్లి పాత్ర గురించి ఆలోచిస్తున్నా. కథ విన్నప్పుడు, చేస్తున్నప్పుడు దీని గురించి ఊహ కూడా రాలేదు. ఇందులో నేనొక యువ తల్లిగా నటించా. కథ విన్నప్పుడే చాలా బాగా నచ్చింది. కథ బలంగా ఉన్నప్పుడు, తల్లి పాత్రలో నటించడం అనేది పెద్ద విషయం కానే కాదు.

KEERTHI SURESH INTERVIEW
పెంగ్విన్​

మాతృత్వం గురించి ఎలాంటి విషయాలు తెలిశాయి? ఆ పాత్ర గురించి ఎలా సన్నద్ధమయ్యారు?

ఈ సినిమాకి సంతకం చేశాక మాతృత్వానికి సంబంధించిన విషయాలన్నింటినీ మా అమ్మని అడిగి తెలుసుకున్నా. గర్భిణిగా కనిపించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా నడవాలి? ఇలా బేసిక్స్‌ అన్నీ అమ్మకి ఫోన్‌ చేసి కనుక్కున్నా. చిత్రీకరణ సమయంలో దర్శకుడు కార్తీక్‌ ఈశ్వర్‌ చిన్న చిన్న విషయాలు కూడా ఓపికగా చెప్పాడు. ఇక తల్లి పాత్రలో భావోద్వేగాలు పండించడం అంటారా? నేను ఇప్పుడు తల్లిని కాకపోవచ్చు కానీ, మా అమ్మకి కూతురినే కదా. ఒక కూతురిగా నన్ను మా అమ్మ ఎలా కంటికి రెప్పలా చూసుకుంటుందో అర్థమైపోతుంది కదా. పైగా ఒక నటి మనసులోకి వంద కథలు వెళ్లిన తర్వాత ఆ పాత్రల్ని ఎలా రక్తి కట్టించాలో సులభంగా అర్థమైపోతుంటుంది. సినిమా చేస్తున్నప్పుడు ఓ పాత్రని మూడో వ్యక్తిగా పరిగణిస్తూ ఎప్పుడూ నటించలేదు. సెట్‌లో ఉన్నంతసేపూ పాత్రలో లీనమైపోతుంటా. పాత్రే నేను, నేనే పాత్ర అన్నట్టుగా ఉంటుంది ఆలోచన.

హిల్‌ స్టేషన్‌లో చిత్రీకరణ అనుభవాలేంటి?

లొకేషన్లు దర్శకుడి మనసులో ఎప్పటి నుంచో ఉన్నాయి. కొడైకెనాల్‌లో తీశాం. అక్కడ ఉదయం 6 గంటలకి షూటింగ్‌ మొదలయ్యేది. అలా 25 రోజులు చిత్రీకరించాం. ఇది చాలా పెద్ద సవాల్‌. షూటింగ్‌ మధ్యలో నాకు జ్వరం వచ్చింది. రెండు రోజులు చిత్రీకరణ ఆపేసి, తర్వాత పూర్తిచేశాం.

కొత్తగా బయోపిక్‌ కథలు ఏమైనా విన్నారా?

ఈ జీవితానికి ఒక్క బయోపిక్‌ చాలు కదా (నవ్వుతూ).

KEERTHI SURESH INTERVIEW
కీర్తి సురేష్​

మహేష్‌తో 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్నారట కదా. నిజమేనా?

అది ఇంకా ఖరారేమీ కాలేదండీ. అయితే నేనే చెబుతా.

'మహానటి' తర్వాత కథల ఎంపికలో మార్పులు వచ్చినట్టున్నాయి. వరుసగా నాయికా ప్రధానమైన కథలు ఎంచుకోవడానికి కారణం అదేనా?

'మహానటి' నాపై పెట్టిన బాధ్యత అలాంటిది. కథల ఎంపికలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. నాకు నేనుగా ఇలాంటి మూవీలనే చేయాలని అనుకోలేదు. 'మహానటి' తర్వాత నా దగ్గరికి వస్తున్న సినిమాలన్నీ అలా బలమైన పాత్రలతో కూడుకున్నవే. అయితే మధ్యలో వాణిజ్య ప్రధానమైన సినిమాలూ చేస్తున్నా. నితిన్‌తో 'రంగ్‌ దే' రొమాంటిక్‌ కామెడీ చిత్రంలో నటిస్తున్నా. ఇలాంటి వాణిజ్య ప్రధానమైన సినిమాలు చేస్తున్నప్పుడు నాకు మంచి పాత్ర ఉండాల్సిందే.

చిత్రీకరణల కోసం ఇప్పుడు సిద్ధంగానే ఉన్నారా?

కరోనా ప్రభావం ఇంకా చాలా ఉంది. ఇప్పుడిప్పుడే షూటింగులంటే భయంగానే ఉంటుంది. అందుకే ఇంకో నెల, రెండు నెలల తర్వాతే బయటికి వెళతానేమో. ఇప్పుడైతే కష్టం. పని చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామనేది సందేహమే కదా.

లాక్‌డౌన్‌తో ఖాళీ సమయం దొరికింది కదా. ఏం చేశారు?

వ్యాయామం, యోగా చేస్తున్నాను. కాలేజీ రోజుల నుంచే వయొలిన్‌ నేర్చుకుంటున్నా. మధ్యలో సినిమాల వల్ల ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ దానిపై దృష్టి పెట్టా. ఇంట్లో స్వయంగా వండుకుంటూ మంచి ఆహారం తింటున్నా. నాకు నైకీ అని ఓ కుక్క పిల్ల ఉంది. చిత్రీకరణల వల్ల దానితో గడిపే సమయమే ఉండేది కాదు. ఇప్పుడు దానితో బాగా ఆడుకుంటున్నా.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.