Kavya Thapar news: నటిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తెలుగు హీరోయిన్ కావ్య తాపర్ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. కారుతో యాక్సిడెంట్ చేయడమే కాకుండా మహిళా పోలీస్తో వాగ్వాదానికి దిగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈమె టాలీవుడ్లో 'ఈ మాయ పేరేమిటో', 'ఏక్ మినీ కథ' సినిమాలు చేసింది.
ఇంతకీ ఏం జరిగింది?
బాలీవుడ్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న కావ్య.. ప్రస్తుతం ముంబయిలో ఉంటుంది. గురువారం ఉదయం మద్యం సేవించి ఆమె కారు నడిపింది. ఈ క్రమంలోనే యాక్సిడెంట్ చేసి ఓ వ్యక్తిని గాయపరిచింది. అడ్డుకున్న పోలీసులను అసభ్య పదజాలంతో దూషించింది. దీంతో కావ్యను అరెస్ట్ చేసి, కస్టడీకి తరలిస్తున్నట్లు జుహూ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఇవీ చదవండి: