నాజూకు నడుముతో యువతకు నిద్రలేకుండా చేసిన భామ ఇలియానా. ఎంతోమంది అగ్రహీరోల సరసన కథానాయికగా నటించి ప్రేక్షకులను మెప్పించిందీ ముద్దుగుమ్మ. రవితేజ నటించిన 'దేవుడు చేసిన మనుషులు' చిత్రంలో కనిపించిన ఇలియానా.. ఆ తర్వాత తెలుగులో నటించలేదు. మళ్లీ ఏడేళ్ల తర్వాత 'అమర్ అక్బర్ ఆంటోని'లో మళ్లీ రవితేజతోనే జోడీ కట్టి పునరాగమనం చేసింది. బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇటీవలే జరిగిన ఓ ముఖాముఖిలో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ఓసారి ఇలియానాను పిలిచి, తన సినిమాలు 'వాంటెడ్', 'కిక్'లలో నటించాలని అడిగాడట. ఆ సమయంలో వేరే చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఆ అవకాశం కోల్పోయినట్లు చెప్పింది.
ఇవీ చూడండి.. ఫస్ట్‌లుక్: వేశ్యగా టబు.. ఇషాన్‌తో రొమాన్స్