'మా' అధ్యక్ష ఎన్నికలపై(MAA elections) నటి హేమ పలు సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల వాయిదాకు నరేశ్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు జరపకుండా, తిరిగి ఆయన్నే ఎన్నుకునే విధంగా చూస్తున్నారని చెప్పారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ 200మంది అసోసియేషన్ సభ్యులకు లేఖలు రాశారు హేమ. ఎన్నికలు జరపాలని సభ్యుల నుంచి సంతకాలు సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు. " 'మా' నిధులు రూ.5 కోట్లలో రూ.3 కోట్లు నరేష్ ఖర్చు చేశారు. కుర్చీ దిగకూడదని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు," అని హేమ అన్నారు.
తెలుగు నటీనటుల సంఘం అధ్యక్ష ఎన్నికలు(MAA Elections) సెప్టెంబర్ 12న నిర్వహించాలని ఇటీవలే కార్యవర్గ సభ్యులు ప్రాథమికంగా నిర్ణయించారు. రెండేళ్లకోసారి జరిగే మా ఎన్నికల్లో ఈసారి సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ తోపాటు యువ కథానాయుడు మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ , హేమ, సీవీఎల్ నర్సింహరావు పోటీపడనున్నారు.
ఇదీ చూడండి:
MAA Elections: ప్రకాశ్ రాజ్ ట్వీట్‌కు నరేశ్ సెటైర్!
MAA Elections: 'మా' ఎన్నికల ప్రక్రియ ఏంటో తెలుసా?