ETV Bharat / sitara

బన్నీ స్టెప్పులకు ఫిదా అయిన బాలీవుడ్​ భామ - దిశా పటాని న్యూస్​

ఇన్​స్టాగ్రామ్​ వేదికగా టాలీవుడ్​ హీరో అల్లు అర్జున్​, బాలీవుడ్​ నటి దిశా పటానీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. 'బుట్టబొమ్మ' పాటలో స్టైలిష్​ స్టార్​ వేసిన స్టెప్పులపై ప్రశంసలు కురిపించింది దిశ. దీనిపై స్పందించిన అల్లుఅర్జున్​.. ఆమెకు ధన్యవాదాలు తెలిపాడు.

Actress Disha Patani is awestruck by Allu Arjun's cool moves in BUTTA BOMMA song
అల్లుఅర్జున్​ స్టెప్పులకు ఫిదా అయిన బాలీవుడ్​ భామ
author img

By

Published : Mar 31, 2020, 1:48 PM IST

కరోనా నియంత్రణలో భాగంగా స్వీయ నిర్బంధంలో ఉన్న సినీతారలు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం స్వీయ నిర్బంధాన్ని పాటిస్తోన్న బాలీవుడ్​ నటి దిశా పటానీ.. ఇన్​స్టాలో స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్​ గురించి ఓ ఆసక్తికర వ్యాఖ్య చేసింది.

Actress Disha Patani is awestruck by Allu Arjun's cool moves in BUTTA BOMMA song
అల్లుఅర్జున్​, దిశా పటానీ ఇన్​స్టాగ్రామ్​ సంభాషణలు

ఎలా చేశారు..!

అల్లు అర్జున్ నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమాలోని 'బుట్టబొమ్మ' పాట ఫ్లోర్​ స్టెప్​ ఎలా వేయగలిగారని.. ఇన్​స్టా వేదికగా దిశా పటానీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దానికి స్పందించిన బన్నీ​.. "నాకు సంగీతమంటే ఇష్టం. అలాంటి సంగీతం వింటే నాకు డ్యాన్స్​ చేయాలనిపిస్తుంది. మీ ప్రశంసకు ధన్యవాదాలు" అని సమాధానమిచ్చాడు స్టైలిష్ స్టార్. అల్లు అర్జున్​ స్పందనకు బదులుగా "మమ్మల్ని ప్రేరేపించినందుకు ధన్యవాదాలు" అని రిప్లే ఇచ్చిందీ అందాల తార.

దిశా పటానీ

దిశా పటానీ.. ప్రస్తుతం సల్మాన్​ఖాన్​ సరసన 'రాధే' చిత్రంలో నటిస్తోంది. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు ఏక్తా కపూర్​ నిర్మాణంలో తెరకెక్కుతోన్న 'ఏక్​ విలన్ 2' సినిమాలోనూ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ​

ఇదీ చూడండి.. 'లింగ వివక్షలేని సమాజాన్ని త్వరలోనే చూస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.