నటి విద్యుల్లేఖ రామన్ త్వరలోనే పెళ్లి కూతురుగా దర్శనమివ్వబోతున్నారు. తమిళ, తెలుగు చిత్రాల్లో తన నటన, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. గతకొంతకాలంగా ఫిట్‌నెస్ నిపుణులు, న్యూట్రీషియన్ అయిన సంజయ్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోవఇరు కుటుంబాల అంగీకారంతో వీరు ఒక్కటి కాబోతున్నారు. సంజయ్‌తో రోకా వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు.
![actress vidyullekha raman latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8635115_3.jpg)
![actress vidyullekha raman latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8635115_1.jpg)
"మేం రోకా చేసుకున్నాం. ఆగస్టు 26న ఈ వేడుక జరిగింది. అతికొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే దీనికి హాజరయ్యారు. మేమందరం మాస్క్‌లు ధరించి, ఫొటోల కోసం వాటిని తీసి, మళ్లీ వేసుకున్నాం. మాకు శుభాకాంక్షలు తెలిపిన వాళ్లందరికీ ధన్యవాదాలు" అని విద్యుల్లేఖ పేర్కొన్నారు.
![actress vidyullekha raman latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8635115_4.jpg)
ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వరుణ్ తేజ్ 'కంగ్రాట్స్ అక్కా' అని కామెంట్ చేయగా, రాశీఖన్నా 'హే క్యూటీస్' అని పేర్కొన్నారు. సాయి తేజ్, నిధి అగర్వాల్, పాయల్ రాజ్‌పుత్, తేజస్వీ, ధన్యబాలకృష్ణన్, రుహానీశర్మ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
![actress vidyullekha raman latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8635115_2.jpg)
బొద్దుగా కనిపించే విద్యుల్లేఖ లాక్‌డౌన్ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. షూటింగ్‌లు లేకపోవడం వల్ల ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి, బరువు తగ్గారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.