"విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రానికి అదిరిపోయే టైటిల్‌ను రెడీ చేశాం" అంటోంది నటి, నిర్మాత ఛార్మి. తాజాగా ఆమె ఈ చిత్ర విశేషాలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
"పూరీ జగన్నాథ్ ఈ కథను విజయ్ దేవరకొండను దృష్టిలో పెట్టుకునే రాసుకున్నారు. తొలిసారి కథ విన్నప్పుడే విజయ్ కూడా ఫిదా అయిపోయాడు. కథ రిత్యానే ముంబయిలో షూట్ చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు కరోనా - లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా చిత్రీకరణపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఆలోచిస్తున్నాం. ప్రభుత్వ అనుమతులకు అనుగుణంగా చిత్రీకరణకు ప్రణాళిక రచిస్తాం. ఈ సినిమాలో కచ్చితంగా ఓ కొత్త విజయ్‌ను చూస్తారు. సినిమాకు 'ఫైటర్' అన్నది వర్కింగ్ టైటిల్ మాత్రమే. కథకు తగ్గట్లుగా అన్ని భాషలకు సరిపోయేలా ఓ అదిరిపోయే టైటిల్‌ను ఇప్పటికే ఖరారు చేశాం. మంచి ముహూర్తం చూసి వెల్లడిస్తాం" అంది ఛార్మి.
ఇదీ చూడండి.. నూనూగు మీసాలోడు.. బాక్సాఫీసును కొల్లగొట్టేశాడు