ETV Bharat / sitara

విద్యార్థులకు ఆ హీరోయిన్ ల్యాప్​టాప్స్​ వితరణ - కరోనా బాధితులకు అండగా నటి ఆండ్రియా

సోషల్​మీడియాలోని పలు కార్యక్రమాలతో విరాళాలు సేకరించిన నటి ఆండ్రియా.. ఆ వచ్చిన డబ్బుతో ముగ్గురు విద్యార్థులకు ల్యాప్​టాప్స్​ పంపిణీ చేసింది. ఆ విషయాన్ని ఇన్​స్టాలో పంచుకుంది.

andrea
ఆండ్రియా
author img

By

Published : Jun 18, 2020, 6:03 PM IST

కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువుర్ని ఆదుకునేందుకు, సెలబ్రిటీలూ ప్రత్యేక్షంగానో లేదా పరోక్షంగానో తమవంతు సాయం చేస్తున్నారు. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విరాళాలు సేకరిస్తున్నారు. నటి ఆండ్రియా ఇలానే పేద విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటు అందించింది. ఆన్​లైన్​లో పాటలు పాడి, బేకింగ్​ సెషన్స్​ నిర్వహించగా వచ్చిన మొత్తంతో ముగ్గురు పేదవిద్యార్థులకు ల్యాప్​టాప్స్​ కొని ఇచ్చింది. ఆ ఫొటోలను ఇన్​స్టాలో పంచుకుంది.

"కుడిచేతితో చేసిన సాయం ఎడమచేతికి తెలియకూడదంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సాయం చేసేవారు కరవయ్యారు. అందుకే నేను చేసినది మీకు తెలియపరుస్తున్నాను. నన్ను చూసి మరికొంతమంది తోడ్పాటు అందిస్తారని భావిస్తున్నాను" అంటూ ఆండ్రియా రాసుకొచ్చింది.

కరోనాతో దాదాపు అన్ని కార్యాలయాలు మూసేశారు. అందులో పాఠశాలలు ఉన్నాయి. లాక్​డౌన్​ సడలింపులు ఇచ్చినా సరే, పాఠశాలలు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడకుండా వారికి ఆన్​లైన్​ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే వీటికోసం విద్యార్థులకు ల్యాప్​టాప్​ తప్పనిసరిగా ఉండాలి. కొంతమంది ఆర్థికస్థితి సరిగా లేక ల్యాప్​టాప్స్​ కొనలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అలాంటి ముగ్గురికి చేయూతనిచ్చింది ఆండ్రియా.

తమిళంలో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. తెలుగులో నాగచైతన్య, సునీల్​ల 'తడాఖా'లో ఓ హీరోయిన్​గా కనిపించింది

ఇది చూడండి : 'పెంగ్విన్​'లో కీర్తి సురేశ్ మేకప్​మ్యాన్​ కూడా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.