తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో విడిపోయిన తర్వాత.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ విషయాన్నీ బహిర్గతం చేయలేదు నటి అమలాపాల్. ఇటీవలె ఈ అమ్మడు.. రెండో పెళ్లి చేసుకుందంటూ బాలీవుడ్ సింగర్ భవీందర్ సింగ్‌తో లిప్‌లాక్ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ విషయంపై తాజాగా ఓ తమిళ న్యూస్ ఛానెల్ ద్వారా స్పందించిందీ నటి.
తనకు రెండో పెళ్లి జరిగిందన్న ప్రచారాన్ని ఖండించింది అమలాపాల్. సోషల్‌మీడియాలో ఉన్న ఆ ఫొటోలు ఓ సంస్థ కోసం చేసిన ఫొటోషూట్‌లో భాగమని చెప్పింది. ఒకవేళ తాను మళ్లీ వివాహం చేసుకుంటే అందరికీ ముందే చెబుతానని పేర్కొంది.
గతంలో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమలో పడింది. 2014లో పెళ్లి చేసుకున్న ఈ జోడి నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో తిరిగి సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. చివరిగా 2019లో 'ఆమె' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అమలాపాల్.
ఇదీ చూడండి.. అమితాబ్ బచ్చన్ కూతురు ఎవరో తెలుసా?