ETV Bharat / sitara

స్నేహా ఉల్లాల్ 'ఎక్స్​పైరీ డేట్' అక్టోబరులో! - sneha ullal latest news

నటి స్నేహా ఉల్లాల్ నటించిన 'ఎక్స్​పైరీ డేట్' వెబ్ సిరీస్.. అక్టోబరు చివరి వారంలో నెటిజన్ల ముందుకు రానుందని సమాచారం.

స్నేహా ఉల్లాల్ 'ఎక్స్​పైరీ డేట్' అక్టోబరులో!
నటి స్నేహా ఉల్లాల్
author img

By

Published : Sep 1, 2020, 6:55 AM IST

గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరమైన నటి స్నేహా ఉల్లాల్.. త్వరలో 'ఎక్స్​పైరీ డేట్' వెబ్​ సిరీస్​తో ప్రేక్షకుల ముందుకు రానుంది. సస్పెన్స్ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ సిరీస్.. అక్టోబరు చివర్లో విడుదల కానుంది. తొలుత జూన్​లో తేవాలని అనుకున్నా, కరోనా ప్రభావంతో అదికాస్త వాయిదా పడింది.

ఈమెతో పాటు అలీ రెజా, భరత్ రెడ్డి, మధు షాలినీ తదితరులు ఈ సిరీస్​లో నటిస్తున్నారు. శంకర్ మార్తాండ్ దర్శకుడు, శరత్ మరార్ నిర్మాత. తన భార్యను హింసాత్మకంగా హత్య చేసిన ఓ వ్యక్తి జీవితంలో తర్వాత జరిగిన పరిణామాలు ఏంటనేదే ఈ వెబ్ సిరీస్ కథ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.