గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా హీరోహీరోయిన్ నిఖిల్, ఐశ్వర్య రాజేశ్.. వేర్వేరుగా మొక్కలు నాటారు. అనంతరం నిఖిల్.. తాను నటిస్తున్న ట18 పేజీస్' చిత్రబృందంతో పాటు హీరోయిన్లు అనుపమ, అవికాగోర్, కలర్స్ స్వాతిలకు మొక్కలు నాటమని సవాలు విసిరారు.
హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ మాత్రం.. తన అభిమానులందరూ హరితహారంలో పాల్గొని మొక్కలు నాటాలని చెప్పింది. అయితే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఎంపీ సంతోష్ కుమార్కు నిఖిల్, ఐశ్వర్య.. ధన్యవాదాలు తెలిపారు.

