కోలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు వివేక్(actor vivek death news).. ఈఏడాది ఏప్రిల్ 17న గుండెపోటుతో కన్నుమూశారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజులకే వివేక్ చనిపోవడం(actor vivek death news) వల్ల.. టీకా వికటించి ఆయన మృతి చెందారనే(actor vivek death cause) అనుమానాలు రేకెత్తాయి. దీంతో తమిళనాడులోని విజుపురానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త.. టీకా పొందడం వల్లే వివేక్ చనిపోయారా? అనే కోణంలో విచారణ(actor vivek death investigation) జరపాలని మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ(actor vivek death investigation) జరిపిన అనంతరం.. తాజాగా ఈ విషయంపై కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది. వివేక్ చనిపోవడానికి రెండు రోజుల మందు టీకా తీసుకున్నారని.. ఆపై అకస్మాత్తుగా గుండెపోటు రావడం వల్ల మృతిచెందారని తెలిపింది(actor vivek death cause). ఆయన చనిపోవడానికి టీకాకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందని పేర్కొంది. ఈవిషయంపై అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ కమిటీ (ఏఈఎఫ్‌ఐ) వివరణ ఇచ్చింది.