తమిళ హీరో విజయ్(vijay new movie).. తన తల్లిదండ్రులతో సహా 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో ఆదివారం కేసు పెట్టారు. అనుమతి లేకుండా తన పేరు ఉపయోగిస్తున్నారని ఇందులో విజయ్ పేర్కొన్నారు. ఇకముందూ తన పేరుతో ఎలాంటి కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించకుండా ఉండేందుకే విజయ్ ఈ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 27న దీనిపై విచారణ జరగనుంది.

ఏడాది క్రితం విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్(hero vijay family).. 'ఆల్ ఇండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్' పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. దీనికి ఆయన జనరల్ సెక్రటరీగా, శోభా చంద్రశేఖర్ కోశాధికారిగా ఉన్నారు.
పార్టీ పెట్టిన కొన్నిరోజులకే విజయ్ వైపు నుంచి ఓ ప్రకటన వచ్చింది. "మా నాన్న పెట్టిన పార్టీతో నేరుగా, పరోక్షంగా గానీ నాకు సంబంధం లేదు. మా నాన్న పార్టీ పెట్టారని నా అభిమానులు ఎవరూ అందులో చేరొద్దు" అని విజయ్ తన నోట్లో పేర్కొన్నారు. పార్టీ కోసం తన పేరు, ఫొటో, ఫ్యాన్స్ క్లబ్‌ను గానీ దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటానని కూడా విజయ్ తెలిపారు.
ఇవీ చదవండి: