అట్లాంటాలో హాలీవుడ్ ప్రముఖ నటుడు థామస్ జెఫర్సన్ బైర్డ్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు బల్వెడెరే అవెన్యూలో ఓ గుర్తు తెలియని వ్యక్తి గాయాలతో పడి ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నది బైర్డ్ అని గుర్తించి పరిశీలించగా.. తుపాకీతో కాల్చి చంపినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అట్లాంటా పోలీసులు తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్పైక్ లీ తెరకెక్కించిన అనేక చిత్రాల్లో థామస్ నటించారు. 'క్లాకర్స్', 'బాంబోజ్లెడ్', 'రే', 'బ్లూక్రిన్స్ ఫైనెస్ట్' తదితర సినిమాల్లో అద్భుత నటన కనబరిచారు.